Share News

డీలిమిటేషన్‌తో దక్షిణాది హక్కులకు తీవ్ర హాని!

ABN , Publish Date - Apr 09 , 2026 | 06:37 AM

యోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌) వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రజల హక్కులకు తీవ్ర హాని కలుగుతుందని..

డీలిమిటేషన్‌తో దక్షిణాది హక్కులకు తీవ్ర హాని!

  • చూస్తూ ఊరుకోబోం.. ప్రాణత్యాగానికైనా సిద్ధం: స్టాలిన్‌

చెన్నై, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌) వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రజల హక్కులకు తీవ్ర హాని కలుగుతుందని తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు మరింత మేలు(బలం) చేకూర్చేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. దీన్ని తమ పార్టీ చూస్తూ ఊరుకోబోదని, డీలిమిటేషన్‌ను వ్యతిరేకించే చర్యల్లో భాగంగా ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అంత అత్యవసరంగా పార్లమెంట్‌ను సమావేశపరచడం ఎందుకు? ఈ నెల 29వ తేదీ తర్వాత పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలన్న విపక్ష నేతల న్యాయమైన సూచనను విస్మరించడం వెనుక ఆంతర్యం ఏమిటి’ అని నిలదీశారు.

ఇవి కూడా చదవండి..

ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..

ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..

Updated Date - Apr 09 , 2026 | 06:37 AM