Share News

స్సైస్‌జెట్‌ విమానాల జాప్యంతో ముంబై విమానాశ్రయంలో గందరగోళం

ABN , Publish Date - May 01 , 2026 | 05:57 AM

స్పైస్‌జెట్‌కు చెందిన పలు విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడవడం, రద్దవ్వడంతో ముంబై విమానాశ్రయం టెర్మినల్‌‘-1లో...

స్సైస్‌జెట్‌ విమానాల జాప్యంతో ముంబై విమానాశ్రయంలో గందరగోళం

ముంబై, ఏప్రిల్‌ 30: స్పైస్‌జెట్‌కు చెందిన పలు విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడవడం, రద్దవ్వడంతో ముంబై విమానాశ్రయం టెర్మినల్‌‘-1లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం దాకా తీవ్ర గందరగోళం నెలకొంది. గంటల తరబడి వేచి చూసిన వందలాది ప్రయాణికులు నానావస్థలు పడ్డారు. నిరీక్షణను భరించలేకపోయిన పలువురు ప్రయాణికులు స్సైస్‌జెట్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బుధవారం రాత్రి ముంబై నుంచి బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్‌ వెళ్లాల్సిన స్సైస్‌జెట్‌ విమానాలు ఆలస్యం, రద్దు అయ్యాయి. బుధవారం ఉదయం ముంబై నుంచి గోరఖ్‌పూర్‌ వెళ్లాల్సిన ఓ విమానం కూడా రద్దయింది. అయితే, వాతావరణం సహకరించకపోవడం వల్ల పలు విమానాలు రద్దయ్యాయని స్పైస్‌జెట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!

పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..

Updated Date - May 01 , 2026 | 05:57 AM