నైరుతికి అనుకూల వాతావరణం
ABN , Publish Date - May 13 , 2026 | 05:00 AM
నైరుతి రుతుపవనాలకు వాతావరణం పూర్తి అనుకూలంగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో...
వారాంతంలో అండమాన్‌కు రుతుపవనాలు: ఐఎండీ
న్యూఢిల్లీ, మే 12: నైరుతి రుతుపవనాలకు వాతావరణం పూర్తి అనుకూలంగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ వారాంతంలోనే రుతుపవనాలు విస్తరిస్తాయని మంగళవారం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రాంతం మంగళవారం నాడు కూడా కొనసాగిందని, తుఫాన్ వలయం సముద్ర మట్టానికి 4.5 కి.మీ వరకు విస్తరించి ఉందని తెలిపింది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని రోజువారీ వాతావరణ నివేదికలో పేర్కొంది. సాధారణంగా మే 20 నాటికి రుతుపవనాలు అండమాన్‌ను తాకి, తర్వాత భారత ప్రధాన భూ భాగంపైకి విస్తరిస్తాయి. జూన్ 1 నాటికి అవి కేరళను తాకుతాయి. కానీ ఈఏడాది కాస్త ముందుగానే రుతుపవనాలు రానున్నాయి. అయితే ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉంటుందని ఐఎండీ గతంలో వెల్లడించింది
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో నూతన విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..
Read Latest Telangana News And AP News And International News And Telugu News