Share News

మన్మోహన్‌కు మోదీకి చాలా తేడా!

ABN , Publish Date - Aug 12 , 2026 | 07:36 AM

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌.. ఈ దేశానికి ‘అత్యంత కీలకమైన ప్రధాని’ అని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ కొనియాడారు. గొప్ప ఫలితాలు సాధించిన ప్రధానిగా...

మన్మోహన్‌కు మోదీకి చాలా తేడా!

  • కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌.. ఈ దేశానికి ‘అత్యంత కీలకమైన ప్రధాని’ అని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ కొనియాడారు. గొప్ప ఫలితాలు సాధించిన ప్రధానిగా చరిత్ర ‘సానుకూలంగా’, ‘నిజంగా’ ఆయనను గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. అదేసమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ నిజాయితీకి, మాజీ ప్రధాని మన్మోహన్‌ నిజాయితీ చాలా భిన్నమైందని వ్యాఖ్యానించారు. మోదీకి, మన్మోహన్‌కు పోలికేలేదని ఉద్ఘాటించారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో వ్యాఖ్యానించారు. ‘‘ఈ దేశానికి మోదీ ప్రధాని కావడం వినాశకరమైనదని.. 2014, జనవరిలోనే మన్మోహన్‌ జోస్యం చెప్పారు. అది.. రోజు రోజుకూ స్పష్టమవుతోంది’’అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్

నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్

Updated Date - Aug 12 , 2026 | 07:36 AM