15వ రోజుకు చేరిన వాంగ్‌చుక్ నిరాహార దీక్ష
ABN , Publish Date - Jul 13 , 2026 | 05:58 AM
పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనలు ఆదివారంతో 23వ రోజుకు చేరుకున్నాయి....
ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందన్న వైద్యులు
ఢిల్లీ, జూలై 12: పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనలు ఆదివారంతో 23వ రోజుకు చేరుకున్నాయి. ఈ నిరసనల్లో భాగంగా ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 15వ రోజుకు చేరడంతో, ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. వైద్యుల నివేదిక ప్రకారం.. వాంగ్‌చుక్ రక్తపోటు (బీపీ) తీవ్రంగా పడిపోయింది. దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఆయన 7.8 కిలోల బరువు తగ్గారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. వాంగ్‌చుక్‌తో పాటు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎ్‌సఏ) ప్రతినిధులు కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు. జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంట్ మార్చ్ నిర్వహించనున్నట్లు నిరసనకారులు ప్రకటించారు.
Also Read:
వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు