వాంగ్‌చుక్ దీక్ష విరమణ
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:22 AM
నీట్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు, పరీక్షల నిర్వహణలో సంస్కరణలు కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్ చుక్ గురువారం అర్థరాత్రి దీక్ష విరమించారు.
న్యూఢిల్లీ, జూలై 23: నీట్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు, పరీక్షల నిర్వహణలో సంస్కరణలు కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్ చుక్ గురువారం అర్థరాత్రి దీక్ష విరమించారు. 26 రోజులుగా దీక్ష చేస్తున్న ఆయన.. మేదాంతా ఆస్పత్రిలో కేంద్రమంత్రులు నడ్డా, జితేంద్రసింగ్‌లతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. తన డిమాండ్లపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని, ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ప్రతీకార చర్యలు ఉండవని కేంద్రం నుంచి హామీ లభించడంతో ఆయన దీక్ష విరమించినట్టు సమాచారం.
సంఘ విద్రోహ శక్తులకు చోటు ఇవ్వొద్దు
మద్దతుదారులకు వాంగ్‌చుక్ సందేశం
శాంతియుత మార్గంలోనే పోరాడాలంటూ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. హింసను ప్రేరేపించడం ద్వారా విద్యార్థుల ఉద్యమాన్ని దెబ్బతీయాలని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నీట్ లీకేజీ అంశంలో కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేయాల ని, విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాలన్న డిమాండ్లతో గతనెల 28 నుంచి ఆయన చేస్తున్న నిరాహార దీక్ష గురువారం 26వ రోజుకు చేరుకుంది. గురుగ్రామ్‌లోని ప్రైవేటు హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న వాంగ్‌చుక్.. తన మద్దతుదారులను ఉద్దేశించి ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ పెట్టారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!
ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు