Share News

నువ్వు సింగం అయితే.. నేను పుష్ప!

ABN , Publish Date - Apr 29 , 2026 | 05:59 AM

పశ్చిమబెంగాల్‌ రెండో విడత పోలింగ్‌ ప్రారంభానికి ముందే దక్షిణ 24పరగణాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బెంగాల్‌ ఎన్నికల కోసం ఈసీ ప్రత్యేక పరిశీలకుడిగా...

నువ్వు సింగం అయితే.. నేను పుష్ప!

న్యూఢిల్లీ/కోల్‌కతా, ఏప్రిల్‌ 28: పశ్చిమబెంగాల్‌ రెండో విడత పోలింగ్‌ ప్రారంభానికి ముందే దక్షిణ 24పరగణాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బెంగాల్‌ ఎన్నికల కోసం ఈసీ ప్రత్యేక పరిశీలకుడిగా నియమించిన యూపీకి చెందిన ఐపీఎస్‌, పోలీస్‌ ‘సింగం’గా పేరుగాంచిన అజయ్‌ శర్మ, ఫాల్తా నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి జహంగీర్‌ ఖాన్‌ మధ్య మాటల తూటాలు పేలాయి. రూల్స్‌ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్న అజయ్‌ శర్మ వార్నింగ్‌పై జహంగీర్‌ కూడా అదే స్థాయిలో స్పందించారు. నువ్వు ‘సింగం’ అయితే.. నేను ‘పుష్ప’ అంటూ బాలీవుడ్‌, తెలుగు సినిమాల పేర్లను ప్రస్తావిస్తూ డైలాగ్‌లు వదిలారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్‌ ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌ ఏసీపీగా పనిచేస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ‘నేర రహిత యూపీ’ లక్ష్యంలో భాగంగా డజన్ల సంఖ్యలో ఎన్‌కౌంటర్లు చేసిన అజయ్‌ శర్మకు ‘ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు’గానూ పేరుంది. బెంగాల్‌ ఎన్నికల కోసం 95 మంది ప్రత్యేక పరిశీలకుల్లో అజయ్‌ శర్మను ఒకరిగా ఈసీ నియమించింది. ఈ క్రమంలో ఫాల్తా నియోజకవర్గంలో జహంగీర్‌ అనుచరులు ఓటర్లను బెదిరిస్తున్నారని అజయ్‌ శర్మకు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఆయన జహంగీర్‌ అనుచరులకు, జహంగీర్‌ఖాన్‌ ఇంటికి వెళ్లి మరీ రూల్స్‌ అతిక్రమించవద్దంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..

Updated Date - Apr 29 , 2026 | 07:11 AM