Share News

శ్మశాన వాటిక అడ్డాగా అక్రమ దందా.. శవాల మీది దుస్తులను..

ABN , Publish Date - May 11 , 2026 | 07:54 AM

ఉత్తర ప్రదేశ్‌లో దారుణ దందా వెలుగులోకి వచ్చింది. ఓ ముఠా శ్మశాన వాటికలో పని చేసే సిబ్బంది సహాయంతో శవాల మీద దుస్తులను దొంగిలించి మార్కెట్‌లో అమ్మేస్తోంది. కేవలం దుస్తులు మాత్రమే కాదు నగలను కూడా ఈ ముఠా దొంగిలించి అమ్మేస్తోంది.

శ్మశాన వాటిక అడ్డాగా అక్రమ దందా.. శవాల మీది దుస్తులను..
Indore crematorium scam

లక్నో, మే 11: ఉత్తర ప్రదేశ్‌లో దారుణ దందా వెలుగులోకి వచ్చింది. ఓ ముఠా శ్మశాన వాటికలో పని చేసే సిబ్బంది సహాయంతో శవాల మీద దుస్తులను దొంగిలించి మార్కెట్‌లో అమ్మేస్తోంది. కేవలం దుస్తులు మాత్రమే కాదు నగలను కూడా ఈ ముఠా దొంగిలించి అమ్మేస్తోంది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఇండోర్‌లోని ఓ శ్మశాన వాటికలో పని చేసే సిబ్బంది శవాల మీద ఉన్న దుస్తులను దొంగిలిస్తున్నారు. వాటిని ఓ ముఠాకు విక్రయిస్తున్నారు. ఆ ముఠా శవాల మీది దుస్తులను కొత్తవని జనాలను నమ్మించేలా కవర్లలో ప్యాక్ చేసి మార్కెట్‌లో అమ్ముతోంది.


ఇండోర్ నుంచి అహ్మదాబాద్ వరకు ఈ దందా సాగుతోంది. శవాలు శ్మశానికి రాగానే అక్కడి సిబ్బంది అంత్యక్రియల కంటే ముందే శవాల మీద నుంచి దుస్తులను తొలగిస్తున్నారు. వాటిని ముఠాకు అందిస్తున్నారు. ఆ ముఠా దుస్తులను ఉతికి, ఐరన్ చేసి మరీ మార్కెట్‌లో తక్కువ ధరకు అమ్ముతోంది. శ్మశాన వాటిక దగ్గర ఏజెంట్లు, మధ్యవర్తులు చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు. దుస్తులు అందగానే వాటిని చాలా తక్కువ ధరకు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు.


శవాల మీది దుస్తుల ధరలు ఇవి..

  • శాలువా - రూ. 20 నుంచి రూ. 40 రూపాయలు

  • కుర్తా పైజామా - రూ. 45

  • షర్ట్, ప్యాంట్స్ - రూ. 50

  • చీర - రూ. 70 నుంచి రూ. 80


ఇవన్నీ మార్కెట్‌ ధరలు. ఆ దుస్తులను ఏజెంట్లు శ్మశాన సిబ్బంది నుంచి ఎంతకు కొంటున్నారన్నది తెలియరాలేదు. ఈ అక్రమ దందా బయటకు రావటంతో స్థానికంగా తీవ్ర కలకలం చెలరేగింది. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శవాలపై వ్యాపారాలు చేయటం ఏంటని మండిపడుతున్నారు. భారీ ఎత్తున జరుగుతున్న ఈ దందా అధికారుల దృష్టికి వెళ్లకుండా ఎలా ఉందని ప్రశ్నిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

విజయ్ ప్రమాణ స్వీకారం.. వైరల్‌గా మారిన త్రిష కంటతడి వీడియో..

స్థిరంగా గోల్డ్ రేట్స్.. ప్రస్తుత ధరలు ఇవీ

Updated Date - May 11 , 2026 | 08:04 AM