చెత్త క్లీన్ చేస్తుండగా బయటపడ్డ పుర్రె, ఎముకలు..
ABN , Publish Date - Mar 13 , 2026 | 08:34 PM
వ్రిక్‌షిత్ ఫౌండేషన్‌కు చెందిన వాలంటీర్లు నగరంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఓ ఏరియాలోని ఫుట్‌పాత్ పక్కన ఉన్న చెత్త క్లీన్ చేస్తూ ఉండగా.. వారికి మనిషి పుర్రె, ఎముకలు దొరికాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: చెత్త క్లీన్ చేస్తుండగా పుర్రె, ఎముకలు బయటపడ్డ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం వ్రిక్‌షిత్ ఫౌండేషన్‌కు చెందిన వాలంటీర్లు నగరంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఓ ఏరియాలోని ఫుట్‌పాత్ పక్కన ఉన్న చెత్త క్లీన్ చేస్తూ ఉండగా.. వారికి మనిషి పుర్రె, ఎముకలు దొరికాయి. దీంతో వారు పని ఆపేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఫోరెన్సిక్ నిపుణులు పుర్రె, ఎముకలను వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఎముకలు మెడికల్ వేస్టేజ్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. పుర్రె, ఎముకలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘హాస్పిటల్స్ దగ్గర ఇలా మెడికల్ వేస్ట్ కనిపిస్తే లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉంది’..‘ఆ పుర్రె, ఎముకలు ఎవరివి? ఎవరినైనా మర్డర్ చేశారా?’..‘వాలంటీర్లు సమాజానికి చాలా మంచి చేస్తున్నారు. కానీ, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరో ఘటనలో..
కొద్దిరోజుల క్రితం షిమ్లాలోని అటల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రి సమీపంలో ఓ కుక్క మనిషి కాలుతో రోడ్డుపై చక్కర్లు కొట్టింది. ఫిబ్రవరి 22వ తేదీన అత్తర్ సింగ్ అనే వ్యక్తి కాలును డాక్టర్లు తొలగించారు. తొలగించిన కాలు భాగాన్ని కవర్‌లో ఉంచి స్టోర్ రూములో భద్రపరిచారు. శానిటేషన్ సిబ్బందికి దాన్ని డిస్పోజ్ చేయమని డాక్టర్లు చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది స్టోర్ రూము డోర్ వేయటం మర్చిపోయారు. దీంతో ఓ కుక్క స్టోర్ రూములోకి ప్రవేశించింది. కవర్‌లో ఉన్న కాలును ఎత్తు కెళ్లిపోయింది.
ఇవి కూడా చదవండి
మిథున్ రెడ్డి బెయిల్ రద్దు నిరాకరించిన హైకోర్టు
మీ ముఖం జిడ్డుగా మారుతోందా? వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!