Share News

షిర్డీ సాయిబాబాపై విద్వేష వీడియోలు..

ABN , Publish Date - Aug 12 , 2026 | 05:45 AM

షిర్డీ సాయిబాబాపై ప్రజల్లో విద్వేషం కలిగించేవిధంగా.. ఆ ఆధ్యాత్మిక గురువును అవమానించేవిధంగా యూట్యూబ్‌, ఇతర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలపై చక్కర్లు కొడుతున్న వీడియోలు, అభ్యంతరకరమైన...

షిర్డీ సాయిబాబాపై విద్వేష వీడియోలు..

తొలగింపుపై నిర్ణయం తీసుకోండి!

కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం

బాబాను జిహాదీ, రేపిస్టు, హంతకుడిగా

చిత్రీకరిస్తున్నారు.. వాటిని తొలగించేలా చూడండి

ఇప్పటికే యూట్యూబ్‌ సంస్థకు విన్నవించాం

అయినా ఆ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోలేదు

న్యాయస్థానానికి తెలిపిన షిర్డీ ట్రస్టు

ఆగస్టు 11: షిర్డీ సాయిబాబాపై ప్రజల్లో విద్వేషం కలిగించేవిధంగా.. ఆ ఆధ్యాత్మిక గురువును అవమానించేవిధంగా యూట్యూబ్‌, ఇతర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలపై చక్కర్లు కొడుతున్న వీడియోలు, అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. షిర్డీ సాయిబాబాకు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో వీడియోలు, పోస్టులు పెట్టారని, వాటిని తొలగించాలంటూ హైకోర్టులో షిర్డీలోని సాయిబాబా సంస్థాన్‌ ట్రస్టు పిటిషన్‌ వేసింది. ఆ వీడియోలు, పోస్టుల్లో సాయిబాబా అసలు పేరు ‘చాంద్‌ మియా’ అంటూ.. ఆయన్ను జిహాదీ, బ్రిటిషర్ల గూఢచారి, హంతకుడు, రేపిస్టు, దోపిడీదారు, మతమార్పిడులు చేసే వ్యక్తి అంటూ అత్యంత దారుణంగా చిత్రీకరిస్తున్నారంటూ ట్రస్టు తన పిటిషన్‌ ద్వారా కోర్టు దృష్టికి తెచ్చింది. ఇదంతా సమాజంలో అశాంతిని, మతపరమైన ద్వేషాన్ని రాజేసేందుకు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న దుష్ప్రచారం అని పిటిషన్‌లో ట్రస్ట్‌ పేర్కొంది. తాము ఇప్పటికే విషయాన్ని యూట్యూబ్‌ దృష్టికి తీసుకెళ్లామని, అయినా షిర్డీ సాయిబాబాకు వ్యతిరేకంగా ప్రసారమవుతున్న వీడియోలపై వారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ట్రస్టు ఆరోపించింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ విచారించారు. సాయిబాబాకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ తొలగింపుపై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్

నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్

Updated Date - Aug 12 , 2026 | 05:45 AM