Share News

షిరిడీ సాయిబాబాపై అభ్యంతరకర వీడియోలు

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:55 AM

షిరిడీ సాయిబాబాను లక్ష్యంగా చేసుకొని రూపొందించిన అభ్యంతరకర యూట్యూబ్‌ వీడియోలను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మరోసారి విచారణ...

షిరిడీ సాయిబాబాపై అభ్యంతరకర వీడియోలు

  • కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ, ఆగస్టు 20: షిరిడీ సాయిబాబాను లక్ష్యంగా చేసుకొని రూపొందించిన అభ్యంతరకర యూట్యూబ్‌ వీడియోలను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. సంబంధిత వీడియోలను యూట్యూబ్‌ నుంచి తొలగించాలని వచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవాలని గ్రీవెన్స్‌ అప్పిలేట్‌ కమిటీ (జీఏసీ)కి సూచించింది. ఇదే అంశంపై స్పందన తెలియజేయాలని కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ మంత్రిత్వశాఖతోపాటు గూగుల్‌ సంస్థకు నోటీసులు జారీ చేసింది. షిరిడీ సాయిబాబాకు సంబంధించి అభ్యంతరకర వీడియోలు తొలగించే అంశంపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని జీఏసీకి ఢిల్లీ హైకోర్టు గతంలోనే సూచించింది. ఈ క్రమంలో జీఏసీ ఇటీవల చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా కొన్ని వీడియోలు అలాగే ఉన్నాయని శ్రీసాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌.. న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది.

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 06:55 AM