Share News

వీల్‌చైర్‌ నుంచి పడి.. నిస్సహాయ స్థితిలో షావుకారు జానకి కుమార్తె

ABN , Publish Date - Oct 27 , 2026 | 04:38 AM

దివంగత ప్రముఖ నటి షావుకారు జానకి పెద్దకుమార్తె యజ్ఞప్రభ(76) ఒంటరిగా ఉంటున్న ఇంట్లో వీల్‌చైర్‌లో నుంచి కింద పడి.. లేవలేక నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు

వీల్‌చైర్‌ నుంచి పడి..   నిస్సహాయ స్థితిలో షావుకారు జానకి కుమార్తె
yagnaprabha

చెన్నై, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): దివంగత ప్రముఖ నటి షావుకారు జానకి పెద్దకుమార్తె యజ్ఞప్రభ(76) ఒంటరిగా ఉంటున్న ఇంట్లో వీల్‌చైర్‌లో నుంచి కింద పడి.. లేవలేక నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది తలుపులు పగులగొట్టి ఆమెను రక్షించారు. షావుకారు జానకి(94) రెండు నెలల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, యజ్ఞప్రభ ఇటీవలే కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. యజ్ఞప్రభ పిల్లలు అమెరికాలో ఉంటుడంగా.. ఆమె చెన్నైలోని దురైపాక్కంలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగానే విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం ఉదయం బాత్రూమ్‌కు వెళ్లివస్తూ వీల్‌చైర్‌ నుంచి జారిపడ్డారు. పైకి లేవలేని స్థితిలో బిగ్గరగా కేకలేసినా.. ఇంటి తలుపులు మూసి ఉండడంతో ఎవరికీ వినిపించలేదు. అతికష్టమ్మీద సెల్‌ఫోన్‌ వద్దకు చేరుకొని బంధువులకు సమాచారం అందించారు. వారిచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి యజ్ఞప్రభను కాపాడారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీ తప్పుకునేదే లేదు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్

SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్

Updated Date - Oct 27 , 2026 | 04:40 AM