జెన్ జీ నిరసనలు.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై శశిథరూర్ ప్రశంసలు
ABN , Publish Date - Aug 27 , 2026 | 09:37 PM
జెన్ జీ నిరసనలకు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ స్పందించిన తీరును కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసించారు.
ఇంటర్నెట్ డెస్క్: జెన్ జీ నిరసనలకు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ స్పందించిన తీరును కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసించారు. ప్రజల సమస్యలకు అనుగుణంగా మార్పు చెందే లక్షణం భారత ప్రజాస్వామ్యానికి ఉందన్న విషయం రుజువైందని వ్యాఖ్యానించారు. భారత్ పొరుగు దేశాల్లో జెన్ జీ ఉద్యోమాలను ఈ సందర్భంగా ఎంపీ శశిథరూర్ ప్రస్తావించారు.
మంత్రి రాజీనామా చేయాలన్న యువత డిమాండ్‌కు కేంద్రం అంగీకరించడం ప్రశంసనీయమని ఎంపీ శశిథరూర్ అన్నారు. వ్యవస్థ మెట్టు దిగినా కుప్పకూలలేదని వ్యాఖ్యానించారు. మయాన్మార్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో యువత నిరసనలు ఇందుకు విరుద్ధంగా ఉండటం అక్కడి ప్రభుత్వ విధానాలు, రాజకీయాలకు అద్దం పడుతోందని అన్నారు. బంగ్లాదేశ్, శ్రీలంకలో ప్రభుత్వాలు మారినా వ్యవస్థలు కొంతవరకూ నిలదొక్కుకున్నాయని చెప్పారు. పాకిస్థాన్, మయాన్మార్‌లో మాత్రం పాలన మిలిటరీ చేతుల్లోకి వెళ్లిపోయిందని అన్నారు.
పొరుగు దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థతి భిన్నమని చెప్పారు. ఇక్కడి పరిస్థులు ఏవీ తలకిందులు కాలేదని అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఊహకందని వేగంతో భారత్ తన మార్గాన్ని సరిచేసుకుందని చెప్పారు. సీజేపీ లేవనెత్తిన అంశాలనే గతంలో కాంగ్రెస్ విద్యార్థుల కోసం లేవనెత్తిందని అన్నారు. కానీ ఆశించిన ఫలితం రాలేదని అన్నారు. జెన్ జీ నాడి పట్టుకోవడంలో తప్పు చేశామా అని ఆలోచించుకోవాలని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ఈ10 పెట్రోల్‌పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు: బీపీసీఎల్
కైలాస మానస సరోవర యాత్ర తాత్కాలికంగా నిలిపివేత