Share News

చర్చలు జరపాలని ప్రధానికి నేనే సలహా ఇచ్చా: పవార్‌

ABN , Publish Date - Jul 26 , 2026 | 05:39 AM

కాక్రోచ్‌ జనతా పార్టీ నాయకులతో చర్చలు జరపాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సలహా ఇచ్చానని ఎన్సీపీ(పవార్‌) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ చెప్పారు. యువ ఆందోళనకారులపై..

చర్చలు జరపాలని ప్రధానికి నేనే సలహా ఇచ్చా: పవార్‌

  • నా సలహాను నరేంద్ర మోదీ పాటించారు: శరద్‌ పవార్‌

పుణె, జూలై 25: కాక్రోచ్‌ జనతా పార్టీ నాయకులతో చర్చలు జరపాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సలహా ఇచ్చానని ఎన్సీపీ(పవార్‌) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ చెప్పారు. యువ ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోరాదని కూడా సూచించానన్నారు. ఈ విషయంలో తన సలహాను మోదీ పాటించారని పవార్‌ తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా యువ శక్తితో పాటు భారత ప్రజాస్వామ్య విజయమన్నారు. అభిజిత్‌ దీప్కేతో జంతర్‌ మంతర్‌లో కలిసినప్పుడు ప్రభుత్వం కనుక చర్చలకు అంగీకరిస్తే చర్చలు తప్పకుండా జరపాలని సలహా ఇచ్చినట్లు పవార్‌ గుర్తు చేశారు. ఈ నెల 23న ప్రధానితో సమావేశమైనప్పుడు ప్రజాస్వామ్యంలో చర్చలు ముఖ్యమని చెప్పానన్నారు. ఉద్యమానికి మద్దతిచ్చిన ప్రతిపక్షాలకు పవార్‌ ధన్యవాదాలు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

Updated Date - Jul 26 , 2026 | 05:39 AM