ముంబైలో కూలిన మెట్రో పిల్లర్ స్లాబ్
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:05 AM
ముంబైలో శనివారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ములుంద్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో లైన్-4కు సంబంధించిన పిల్లర్ భాగం ఒక్కసారిగా కింద వెళ్తున్న...
ధ్వంసమైన ఆటో, కారు.. ఒకరి మృతి
ముంబై, ఫిబ్రవరి 14: ముంబైలో శనివారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ములుంద్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో లైన్-4కు సంబంధించిన పిల్లర్ భాగం ఒక్కసారిగా కింద వెళ్తున్న వాహనాలపై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్‌బీఎస్ రోడ్డులోని జాన్సన్ అండ్ జాన్సన్ ఫ్యాక్టరీ సమీపంలో మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మెట్రో పిల్లర్ 196 వద్ద పనులు జరుగుతుండగా, పారాపెట్ గోడకు సంబంధించిన భారీ కాంక్రీట్ స్లాబ్ అకస్మాత్తుగా కింద వెళ్తున్న ఒక ఆటోరిక్షా, కారుపై పడింది. ఆ దాటికి వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న రామ్‌ధన్ యాదవ్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపు ఎవరిదంటే..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపు ఎవరిదంటే..