5న సీజేపీ కీలక సభ్యుల భేటీ
ABN , Publish Date - Aug 03 , 2026 | 05:38 AM
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కీలక సభ్యుల సమావేశం ఈ నెల అయిదో తేదీన ఇక్కడ జరగనుంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నివాసమే ఇందుకు వేదిక కానుందని ఆదివారం ఆ పార్టీ వర్గాలు...
భవిష్యత్తు ప్రణాళిక రూపకల్పన
శంభాజీనగర్‌లోని దీప్కే నివాసమే వేదిక
ఛత్రపతి శంభాజీనగర్, ఆగస్టు 2: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కీలక సభ్యుల సమావేశం ఈ నెల అయిదో తేదీన ఇక్కడ జరగనుంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నివాసమే ఇందుకు వేదిక కానుందని ఆదివారం ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించేందుకు విద్యార్థులు, స్వచ్ఛంద కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొని నూతన ఆలోచనలు, సలహాలతో రావాలని కీలక సభ్యులకు పార్టీ సూచించింది. నీట్ పేపరు లీకేజీ విషయమై దాదాపు నెల రోజుల పాటు ఢిల్లీలో ఆందోళన చేసిన నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కొంతకాలం గడపాలని కార్యకర్తలు, స్వచ్ఛందసేవకులకు విజ్ఞప్తి చేసింది. భేటీ అనంతరం కీలక సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు ప్రణాళికపై తీసుకున్న నిర్ణయాలను వెల్లడించనున్నారు.
తమినాడులో విద్యార్థులపై కేసుల రద్దు
చెన్నై, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): నీట్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదుచేసిన పోలీసు కేసులన్నింటినీ రద్దు చేస్తున్నట్టు తమిళనాడు సీఎం విజయ్ ప్రకటించారు. ఢిల్లీ జంతర్ మంతర్ ప్రాంతంలో సీజేపీ చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా తమిళనాట ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐ సహా పలు విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రైల్‌రోకో, రాస్తారోకో, నిరసన ప్రదర్శనలు జరిపారు. ఆ సందర్భంగా విద్యార్థులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, మోదీ, అమిత్ షా, యోగిలను హత్య చేస్తానంటూ బెదిరించిన ఝార్ఖండ్‌లోని రాంచీకి చెందిన అన్సారీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..
వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..