Share News

యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో సారనాథ్‌

ABN , Publish Date - Jul 26 , 2026 | 04:53 AM

ఉత్తరప్రదేశ్‌లోని సారనాథ్‌లో ఉన్న ప్రాచీన బౌద్ధ క్షేత్రాన్ని ప్రపంచ వారసత్వ జాబి తాలో చేర్చుతున్నట్టు శనివారం యునెస్కో ప్రకటించింది...

యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో సారనాథ్‌

  • భారతీయులకు గర్వకారణం: మోదీ

న్యూఢిల్లీ, జూలై25: ఉత్తరప్రదేశ్‌లోని సారనాథ్‌లో ఉన్న ప్రాచీన బౌద్ధ క్షేత్రాన్ని ప్రపంచ వారసత్వ జాబి తాలో చేర్చుతున్నట్టు శనివారం యునెస్కో ప్రకటించింది. వారాణసికి సుమారు 10కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి గౌతమ బుద్ధుని జీవితంతో ఎంతో అనుబంధం ఉంది. దక్షిణ కొరియా లోని బుసాన్‌లో జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటుచే సుకున్న భారతదేశ క్షేత్రాల్లో ఇది 45వది కావడం గమనార్హం. ఈ నిర్ణయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణమంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

Updated Date - Jul 26 , 2026 | 05:21 AM