Share News

అమెరికాకు భారత్‌ లొంగిపోయినట్టే కనిపిస్తోంది!

ABN , Publish Date - Feb 13 , 2026 | 06:26 AM

అమెరికాతో వాణిజ్య ఒప్పందం అంశంలో మోదీ ప్రభుత్వ తీరును చూస్తే.. అమెరికా ఒత్తిళ్లకు భారత్‌ లొంగిపోయిందనే అభిప్రాయమే కలిగిస్తోందని ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత, మాజీ ప్రధాని...

అమెరికాకు భారత్‌ లొంగిపోయినట్టే కనిపిస్తోంది!

  • వాణిజ్య ఒప్పందంపై సందేహాలెన్నో!

  • ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత సంజయ బారు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: అమెరికాతో వాణిజ్య ఒప్పందం అంశంలో మోదీ ప్రభుత్వ తీరును చూస్తే.. అమెరికా ఒత్తిళ్లకు భారత్‌ లొంగిపోయిందనే అభిప్రాయమే కలిగిస్తోందని ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సలహాదారు సంజయ్‌బారు పేర్కొన్నారు. భారత్‌పై పెద్ద దేశాల ఒత్తిళ్లు ఎప్పుడూ ఉండేవేనని.. అప్పటి పరిస్థితులను, పరిణామాలను బట్టి వాటికి తలొగ్గాల్సి వస్తుందని చెప్పారు. కానీ లొంగిపోవడాన్ని కూడా గొప్ప విజయం అన్న ట్టు చూపుకోవడం ఇదే మొదటిసారని ఇండియన్‌ ఎక్స్‌ప్రె్‌సకు రాసిన ఆర్టికల్‌లో వ్యాఖ్యానించారు. మన ప్రభుత్వాధినేతలను అవమానించేలా అగ్రదేశాల నేతలు మాట్లాడటం కూడా ఇదే తొలిసారని పేర్కొన్నారు. మోదీ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోవాలని తాను కోరుకోవడం లేదంటూ ట్రంప్‌ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వివరాలను ప్రధాని మోదీ నేరుగా పార్లమెంటులో వెల్లడించి ఉండాల్సిందని, అలాకాకుండా వాణిజ్య, విదేశాంగ శాఖల మంత్రులు అస్పష్టమైన ప్రకటనలు చేసి వదిలేశారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు అమెరికాతో అణు ఒప్పందం విషయంలో వ్యవహరించిన తీరును గుర్తు చేశారు. అణు ఒప్పందంపై చర్చలు జరిపి అమెరికా నుంచి తిరిగి రాగానే.. ఆ ఒప్పందం ఎందుకు? భారత ఇంధన భద్రతకు ఎంత ప్రయోజనం అన్న వివరాలను పార్లమెంటులో వెల్లడించారని చెప్పారు. తర్వాత మూడేళ్లపాటు పార్లమెంటులో దీనిపై లోతుగా చర్చలు జరిగాయని వివరించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై సందేహాలెన్నో ముసురుకున్నాయని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి..

114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు

Updated Date - Feb 13 , 2026 | 06:26 AM