Share News

విజయ్‌తో విడాకులు ఇప్పించండి

ABN , Publish Date - Feb 28 , 2026 | 05:20 AM

ప్రముఖ తమిళనటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్‌ నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ ఆయన సతీమణి సంగీత కోర్టును ఆశ్రయించారు. విజయ్‌ మరో...

విజయ్‌తో విడాకులు ఇప్పించండి

  • కోర్టును ఆశ్రయించిన భార్య సంగీత

చెన్నై, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ప్రముఖ తమిళనటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్‌ నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ ఆయన సతీమణి సంగీత కోర్టును ఆశ్రయించారు. విజయ్‌ మరో నటితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనకు తీరని ద్రోహం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు సంగీత శుక్రవారం చెంగల్పట్టు జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2021లో విజయ్‌ ఓ నటితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యానని, ఆ నటితో సంబంధాలు తెంచుకుంటానని హామీ ఇచ్చి కూడా విజయ్‌ తనను మోసగించారని ఆరోపించారు. ఇలా తమ మధ్య ఏర్పడిన మనస్పర్థలను పరిష్కరించుకునేందుకు 2021, సెప్టెంబరు-2022, ఫిబ్రవరి మధ్య న్యాయవాది ద్వారా ప్రయత్నించినా పరిష్కారం లభించలేదన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ప్రాథమిక విచారణ జరిపింది. అనంతరం ఏప్రిల్‌ 20కి విచారణను వాయిదా వేసింది.

ఈ వార్తలూ చదవండి

ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ

కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ

Updated Date - Feb 28 , 2026 | 05:20 AM