Share News

సమృద్ధి మహామార్గ్‌పై ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి..

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:30 PM

మహారాష్ట్రలోని సమృద్ధి మహామార్గ్‌లో ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొని ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

సమృద్ధి మహామార్గ్‌పై ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి..
Samruddhi Expressway Accident

నాగ్‌పూర్: మహారాష్ట్రలోని సమృద్ధి మహామార్గ్‌లో ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొని ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ముంబై నుంచి నాగ్‌పూర్ వైపు ఇథనాల్ లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ ట్యాంకర్ తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో రోడ్డు మొత్తం బ్లాక్ అయింది. కొద్దిసేపటికి అదే మార్గంలో వెళ్తున్న లారీ డ్రైవర్ ప్రమాదానికి గురైన వాహనాన్ని చూశాడు. కంగారులో ఎదురుగా ఉన్న కారును బలంగా ఢీకొట్టాడు.


ఈ ప్రమాదంలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. లారీలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా వార్ధా జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలిపారు. మరోవైపు, సమాచారం అందుకున్న వెంటనే వార్ధా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోల్తాపడిన ట్యాంకర్‌లో అత్యంత మండే స్వభావం కలిగిన ఇథనాల్ ఉండటంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి. ముందుగా ట్యాంకర్‌లోని ఇథనాల్‌ను సురక్షితంగా తొలగించిన తర్వాతే వాహనాన్ని పక్కకు తరలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం లేదా పేలుడు సంభవించే ప్రమాదం ఉండటంతో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


మరోవైపు, ఈ ఘటనతో ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనాలను మళ్లించేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇథనాల్ ట్యాంకర్‌ను సురక్షితంగా తొలగించిన తర్వాతే రహదారిని పూర్తిగా తెరిచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

సీఎం విజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు.. ఎమ్మెల్యేను అరెస్టు చేసిన పోలీసులు..

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్.. సీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్..

Updated Date - Jul 20 , 2026 | 12:32 PM