కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ మృతి
ABN , Publish Date - Aug 21 , 2026 | 06:17 AM
కాంగ్రెస్ మాజీ ఎంపీ, 1984- సిక్కు వ్యతిరేక దాడుల కేసుల్లో జైలు పాలైన సజ్జన్ కుమార్ (84) గురువారం కన్నుమూశారు. అపస్మారక స్థితిలో ఉదయం 11 గంటలకు సజ్జన్ కుమార్‌ను...
1984 సిక్కు వ్యతిరేక దాడుల కేసుల్లో దోషి
తిహాడ్ జైల్లో అస్వస్థత
అపస్మారక స్థితిలో ఆస్పత్రికి
చికిత్స పొందుతూ మృతి
న్యూఢిల్లీ, ఆగస్టు 20: కాంగ్రెస్ మాజీ ఎంపీ, 1984- సిక్కు వ్యతిరేక దాడుల కేసుల్లో జైలు పాలైన సజ్జన్ కుమార్ (84) గురువారం కన్నుమూశారు. అపస్మారక స్థితిలో ఉదయం 11 గంటలకు సజ్జన్ కుమార్‌ను పోలీసులు చికి త్స కోసం తీసుకొచ్చారని, ఆయన ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి ఓ ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం 12.30 గంటలకు మరణించారని పేర్కొంది. పార్కిన్సన్, అధిక రక్తపోటు వంటి పలు ఆరోగ్య సమస్యలతో సజ్జన్‌కుమార్ బాధపడుతున్నారు. 1984లో ప్రధాని ఇందిర దారుణ హత్య తర్వాత ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక దాడుల్లో ఓ గురుద్వారా వద్ద ఐదుగురు సిక్కుల దహనం కేసులో సజ్జన్‌కుమార్‌కు 2018 డిసెంబరులో ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పటినుంచి ఆయన తిహాడ్ జైలులోనే ఉన్నారు. ఇద్దరు సిక్కుల హత్య కేసులో ఓ ఢిల్లీ కోర్టు గతేడాది ఫిబ్రవరిలో సజ్జన్‌కు జీవిత ఖైదు విధించినా.. మరో కేసులో గత జనవరిలో ఒక ఢిల్లీ న్యాయస్థానం ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. ఔటర్ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన సజ్జన్.. తనకు న్యాయస్థానం జైలుశిక్ష విధించగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సిక్కు వ్యతిరేక దాడుల విషయమై మూడు దశాబ్దాలకు పైగా పలు క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న ప్రముఖ ప్రజాప్రతినిధుల్లో ఆయన ఒకరు.
ఇవి కూడా చదవండి:
పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్
బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు