Share News

ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2026 విజేతగా గోవా సుందరి సాధ్వి సతీష్‌ సైల్‌

ABN , Publish Date - Apr 20 , 2026 | 07:13 AM

గోవాకు చెందిన సాధ్వి సతీష్‌ సైల్‌.. ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2026 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ కిరీటాన్ని కైవసం చేసుకోవడానికి...

ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2026 విజేతగా గోవా సుందరి సాధ్వి సతీష్‌ సైల్‌

  • 8 75వ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం

భువనేశ్వర్‌, ఏప్రిల్‌ 19: గోవాకు చెందిన సాధ్వి సతీష్‌ సైల్‌.. ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2026 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ కిరీటాన్ని కైవసం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా 30 మంది అందాల భామలు పోటీ పడ్డారు. అయితే వీరిలో సాధ్వి సతీష్‌ సైల్‌ విజేతగా నిలిచారు. శనివారం రాత్రి భువనేశ్వర్‌లోని కేఐఐటీ యూనివర్సిటీలో అట్టహాసంగా జరిగిన 61వ ఫెమినా మిస్‌ ఇండియా గ్రాండ్‌ ఫినాలేలో ఆమె ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. గత ఏడాది విజేత నికితా పోర్వాల్‌.. సాధ్వికి మిస్‌ ఇండియా కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయంతో ఆమె 75వ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ

భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో

Updated Date - Apr 20 , 2026 | 07:13 AM