Share News

శబరిమలలో ఏఐతో రద్దీ నియంత్రణ!

ABN , Publish Date - Jun 13 , 2026 | 05:34 AM

శబరిమల దేవస్థానం వార్షిక తీర్థయాత్ర సీజన్‌లో పెరిగే భక్తుల రద్దీని క్రమబద్దీకరించడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సాంకేతికతను..

శబరిమలలో ఏఐతో రద్దీ నియంత్రణ!

తిరువనంతపురం, జూన్‌ 12: శబరిమల దేవస్థానం వార్షిక తీర్థయాత్ర సీజన్‌లో పెరిగే భక్తుల రద్దీని క్రమబద్దీకరించడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించినట్లు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు జయకుమార్‌ వెల్లడించారు. పంబ నుంచి సన్నిధానం వరకు భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే, ఆలయంలో ఇకపై నగదు ఆధారిత చెల్లింపులు ఉండబోవని.. కానుకలు, ప్రసాదాల కొనుగోలు, వసతి వంటి అన్ని సేవలను డిజిటలైజ్‌ చేస్తున్నట్లు చెప్పారు. అవినీతి ఆరోపణలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు

రిజర్వేషన్లపై కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక.. సర్వత్ర ఉత్కంఠ

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 05:34 AM