Share News

కేంద్ర మంత్రి జైశంకర్, ఆర్మీ మాజీ చీఫ్, సీబీఐ డైరెక్టర్‌కు ‘సర్’ నోటీసులు

ABN , Publish Date - Sep 20 , 2026 | 07:05 PM

కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్, ఆయన భార్య క్యోకో ఎస్ జైశంకర్‌కు ఎలక్షన్ కమిషన్ ‘సర్’ నోటీసులు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఆయన కుటుంబసభ్యులకు, భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, ఆయన భార్యకు కూడా ఇవే నోటీసులు జారీ అయ్యాయి.

కేంద్ర మంత్రి జైశంకర్, ఆర్మీ మాజీ చీఫ్, సీబీఐ డైరెక్టర్‌కు ‘సర్’ నోటీసులు
Minister Jaishankar, Gen Upendra Dwivedi, CBI Chief Praveen Sood

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్, ఆయన భార్య క్యోకో ఎస్ జైశంకర్‌కు ఎలక్షన్ కమిషన్ ‘సర్’ నోటీసులు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఆయన కుటుంబసభ్యులకు, భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, ఆయన భార్యకు కూడా ఇవే నోటీసులు జారీ అయ్యాయి. గత సర్ ప్రక్రియ‌కు సంబంధించిన జాబితాలోని పేర్లతో ప్రస్తుత వివరాలు మ్యాప్ కానందున నోటీసులు జారీ చేశామని ఈసీ పేర్కొంది.


మంత్రి జైశంకర్, ఆయన భార్య పేర్లను ‘అన్‌మ్యాప్డ్ విత్ లాస్ట్ సర్’ కేటగిరీలో చేర్చారు. 2002 నాటి ఓటర్ల జాబితాలో ప్రస్తుత వివరాలు సరిపోల్చలేని కారణంగా ఈ నోటీసులు జారీ చేశారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఆయన భార్య వనితా సూద్, తల్లి కమ్లేశ్ సూద్‌కు కూడా ఇవే నోటీసులు జారీ అయ్యాయి. వీరితో పాటు మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, ఆయన భార్య సునితా ద్వివేదీ కూడా ఇవే నోటీసులు జారీ అయ్యాయి. ఇక సీపీఎం ఎపీ జాన్ బ్రిట్టాస్ భార్య షీబా బ్రిట్టాస్, వారి కుమారుడు ఆనంద్ బ్రిట్టాస్ వివరాల విషయంలో ఇతర అభ్యంతరాలు ఉన్నాయి. షీబా పేరులో తేడాలు, ఆనంద్ బ్రిట్టాస్ పేరు విషయంలో పేరెంట్ నేమ్ మిస్‌మ్యాచ్ కనిపించింది.


కేంద్ర మంత్రి జైశంకర్, ఆయన భార్య న్యూఢిల్లీ నియోజకవర్గంలోని సుందర్‌బాఘ్ ఎలక్టోరల్ పార్ట్ ఓటర్లుగా ఉన్నారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేదీ, ఆయన సతీమణి, సీపీఎం నేత జాన్ బ్రిట్టాస్ సతీమణి, వారి కుమారుడు కూడా ఇదే నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

రాహుల్‌కు మిగిలిన ఏకైక ఉద్యోగం.. స్టాండ్-అప్ కామెడీయే: సీఎం ఫడ్నవీస్

కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఛార్జిషీట్ దాఖలు..

Updated Date - Sep 20 , 2026 | 07:45 PM