Share News

త్రిపురలో బీఎఎస్ఎఫ్‌ జవాన్లపై గ్రామస్థుల దాడి

ABN , Publish Date - Nov 04 , 2026 | 05:13 AM

త్రిపురలో బీఎస్ఎఫ్‌ జవాన్లపై గ్రామస్థులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ సహా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

త్రిపురలో బీఎఎస్ఎఫ్‌ జవాన్లపై గ్రామస్థుల దాడి
bsf

అగర్తల, నవంబరు 3: త్రిపురలో బీఎస్ఎఫ్‌ జవాన్లపై గ్రామస్థులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ సహా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. సెపాహిజాలా జిల్లాలోని అశాబరి సరిహద్దు అవుట్‌పోస్టు సమీపంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్మగ్లింగ్‌ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని బీఎస్ఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు వారిపై దాడికి దిగారు. వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు జవాన్ల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు సెపాహిజాలా ఎస్పీ విజయ్‌ దేబ్‌బర్మా తెలిపారు

Updated Date - Nov 04 , 2026 | 05:14 AM