Share News

రోప్‌వే ట్రాలీ విరిగిపడి మహిళ మృతి, ఏడుగురికి గాయాలు

ABN , Publish Date - Mar 22 , 2026 | 02:29 PM

ఛత్తీస్‌గఢ్ జిల్లా మహాసముంద్ జిల్లాలో కొండపై నున్న ఆలయం నుంచి కిందకి వస్తున్న రోప్‌వే ట్రాలీ తెగిపడిన ఘటన ఆదివారంనాడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.

రోప్‌వే ట్రాలీ విరిగిపడి మహిళ మృతి, ఏడుగురికి గాయాలు
ropeway trolley crashes

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ జిల్లా మహాసముంద్ జిల్లాలో కొండపై నున్న ఆలయం నుంచి కిందకి వస్తున్న రోప్ వే ట్రాలీ తెగిపడిన ఘటన ఆదివారంనాడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎనిమిది మంది ప్రయాణికులతో ట్రాలీ కేబుల్ కిందకు వస్తుండగా తెగిపడినట్టు అధికారులు తెలిపారు. బాధితులు నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు కొండపై నున్న ఖల్లారి మాత ఆలయానికి వచ్చినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. మృతురాలిని రాయపూర్‌కు చెందిన 28 ఏళ్ల ఆయూషి సత్కార్‌గా గుర్తించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికరాలు విచారణ జరుపుతున్నారు.


ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి సంతాపం

ఖల్లారి మాత ఆలయం వద్ద జరిగిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఖల్లారి మాతను ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాల దగ్గర తప్పనిసరి వసతులు

పుదుచ్చేరి, కేరళ అభ్యర్థుల తాజా జాబితా విడుదల చేసిన బీజేపీ

Updated Date - Mar 22 , 2026 | 03:10 PM