Share News

ఆర్‌ఎంపీలకు ఇక యూనిక్‌ ఐడీ!

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:57 AM

రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ (ఆర్‌ఎంపీ) రిజిస్ట్రేషన్‌, ప్రాక్టీస్‌ విధానంలో జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) కీలక మార్పు లు చేసేందుకు సిద్ధమైంది..! దేశంలోని ప్రతి ఆర్‌ఎంపీకి...

ఆర్‌ఎంపీలకు ఇక యూనిక్‌ ఐడీ!

  • ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో దేశమంతా ఒకే లైసెన్స్‌

  • ఎన్‌ఎంసీ కీలక ప్రతిపాదనలు

న్యూఢిల్లీ, ఆగస్టు 20: రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ (ఆర్‌ఎంపీ) రిజిస్ట్రేషన్‌, ప్రాక్టీస్‌ విధానంలో జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) కీలక మార్పు లు చేసేందుకు సిద్ధమైంది..! దేశంలోని ప్రతి ఆర్‌ఎంపీకి ఆధార్‌ తరహాలో ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ను కేటాయించేలా యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ (యూ ఐడీ) ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనివల్ల రాష్ట్రాల వారీగా వేర్వేరు రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ చేసుకున్న ఆర్‌ఎంపీలు దేశంలో ఎక్కడైనా ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. దీనికోసం దేశంలో నమోదిత ఆర్‌ఎంపీలందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. ‘రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌, లైసెన్స్‌ టు ప్రాక్టీస్‌ మెడిసిన్‌-2026’ పేరుతో ఎన్‌ఎంసీ ఇటీవల కొత్త ముసాయిదాను విడుదల చేసింది. మెడికల్‌ రిజిస్టర్‌లో నమోదైన తర్వాత వారికి.. ఎన్‌ఎంసీకి చెందిన ‘ఎథిక్స్‌, మెడికల్‌ రిజిస్ట్రేషన్‌ బోర్డు’ (ఈఎంఆర్‌బీ) ఒకప్రత్యేక గుర్తింపు సంఖ్యను జారీచేస్తుంది. ఈ యూఐడీ ద్వారా నేషనల్‌ మెడికల్‌ రిజిస్టర్‌ (ఎన్‌ఎంఆర్‌)లో నమోదవడంతోపాటు వారు దేశంలో ఎక్కడైనా వైద్యవృత్తిని కొనసాగించవచ్చు. రాష్ట్రవైద్యమండలి రిజిస్ట్రేషన్‌, లైసెన్స్‌ మంజూరు చేశాక ఈఎంఆర్‌బీ ద్వారా ఎన్‌ఎంఆర్‌లో యూఐడీ కేటాయిస్తారని ముసాయిదాలో పేర్కొన్నా రు. అలాగే లైసెన్స్‌ కాలపరిమితిపైనా ఎన్‌ఎంసీ కీలక మార్పులు ప్రతిపాదించింది. ఇకపై వీరికి ఇచ్చే లైసె న్స్‌ ఐదేళ్ల కాలానికే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈ గడువు ముగియడానికి 3 నెలల ముందే దీన్ని రెన్యూవల్‌ చేసుకోవాలని సూచించింది.

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 06:58 AM