Share News

బాబోయ్‌.. అద్దె ఇంటి అడ్వాన్స్‌!

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:42 AM

శంలోని ఆరు మెట్రో నగరాల్లో అద్దె ఇంటి యజమానులు అడ్వాన్స్‌(సెక్యూరిటీ డిపాజిట్‌) రూపంలో అద్దెదారుల నుంచి రూ.1.26 లక్షల కోట్లు వసూలు చేసినట్టు...

బాబోయ్‌.. అద్దె ఇంటి అడ్వాన్స్‌!

  • మెట్రో నగరాల్లో భారీగా వసూలు

  • ఇళ్ల యజమానుల వద్ద రూ.1.26 లక్షల కోట్లు జమ

న్యూఢిల్లీ, జూలై 16: దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో అద్దె ఇంటి యజమానులు అడ్వాన్స్‌(సెక్యూరిటీ డిపాజిట్‌) రూపంలో అద్దెదారుల నుంచి రూ.1.26 లక్షల కోట్లు వసూలు చేసినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌, పుణె నగరాల్లో నో బ్రోకర్‌ సంస్థ అధ్యయనం నిర్వహించి ఈ వివరాలు వెల్లడించింది. అత్యధికంగా ముంబైలో రూ.41,156 కోట్లు, బెంగళూరులో రూ.31,628 కోట్లను అద్దెదారుల నుంచి ఇంటి యజమానులు అడ్వాన్స్‌ రూపంలో వసూలు చేశారు. నగరాలు, పట్టణాల్లో నివసించేవారి నెలవారీ బడ్జెట్‌లో ఇంటిఅద్దె ఏకైక అతిపెద్ద మొత్తంగా ఉంటోందని ‘నో బ్రోకర్‌’ నివేదిక తెలిపింది. తమ నెలజీతంలో 30ు ఇంటి అద్దెకే పోతోందని దాదాపు సగం మంది వెల్లడించారు. ముంబైలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తమ ఆదాయంలో సగానికిపైగా ఇంటిఅద్దెకే చెల్లిస్తున్నామని ముంబైలోని 25ు మంది అద్దెదారులు తెలుపగా, ఆదాయంలో 41% నుంచి 50% ఇంటి అద్దెకు చెల్లిస్తున్నామని మరో 15% మంది చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక

Updated Date - Jul 17 , 2026 | 05:42 AM