Share News

క్రెడిట్‌ కార్డు లావాదేవీలో మోసం జరిగితే

ABN , Publish Date - Jun 25 , 2026 | 06:19 AM

క్రెడిట్‌ కార్డు ద్వారా మోసపూరిత లావాదేవీ జరిగినప్పుడు వినియోగదారుపై భారం తగ్గించి, రక్షణ కల్పించేలా రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) బుధవారం సవరించిన మార్గదర్శకాలను...

క్రెడిట్‌ కార్డు లావాదేవీలో మోసం జరిగితే

5 రోజుల్లో సొమ్ము వాపసు

  • ప్రతి లావాదేవీకి ఎస్‌ఎంఎస్‌ తప్పనిసరి: ఆర్బీఐ

ముంబై, జూన్‌ 24: క్రెడిట్‌ కార్డు ద్వారా మోసపూరిత లావాదేవీ జరిగినప్పుడు వినియోగదారుపై భారం తగ్గించి, రక్షణ కల్పించేలా రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) బుధవారం సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు 2027 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. మోసపూరిత లావాదేవీ జరిగినట్టు వినియోగదారుడు ఫిర్యాదు చేసిన 5రోజుల్లోగా ఆ సొమ్మును ‘షాడో రివర్సల్‌’, ‘ప్రొవిజినల్‌ క్రెడిట్‌’ రూపంలో తిరిగి జమ చేయాల్సి ఉంటుందన్నది ఇందులో ప్రధానమైన అంశం. ఎలకా్ట్రనిక్‌ బ్యాంకింగ్‌ ట్రాన్సాక్షన్‌ (ఈబీటీ)ల్లో మోసాలు జరగకుండా ప్రతి బ్యాంకు సొంతంగా విధానాలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. రూ.500కు మంచి ఎలకా్ట్రనిక్‌ రూపంలో లావాదేవీ జరిగితే బ్యాంకులు తప్పనిసరిగా తక్షణ అలెర్ట్‌ పంపించాల్సి ఉంటుంది. అంతకన్నా తక్కువయితే ఉచితంగా తక్షణ ఎస్‌ఎంఎస్‌ పంపించాలి. వీటిపై తేదీ, సమయాలు తప్పకుండా ఉండాలి. వినియోగదారుడి నుంచి ఫిర్యాదు అందిన వెంటనే మరిన్ని మోసపూరిత లావాదేవీలు జరగకుండా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ మళ్లీ మోసం జరిగితే అందుకు బ్యాంకు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఫిర్యాదు అందిన 5రోజుల్లోగా సొమ్మును తిరిగి చెల్లించాలి. మోసం జరిగిన 5రోజుల తరువాత ఫిర్యాదు అందితే ఎంత మొత్తం చెల్లించాలనేదానిపై ఆయా బ్యాంకులు సొంతంగా విధానాలను రూపొందించుకోవచ్చు. వినియోగదారుడి కారణంగానే తప్పుడు లావాదేవీ జరిగితే పరిహారాన్ని పరిమితంగా మాత్రమే పొందే అవకాశం ఉంది. రూ.50,000వరకు మోసం జరిగినట్టు ఫిర్యాదు అందితే అందులో 85ు గానీ, రూ.25వేలుగానీ ఏది తక్కువైతే అది చెల్లించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!

టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!

Updated Date - Jun 25 , 2026 | 06:19 AM