Share News

ఏడాదిలో 127కిలోల బంగారం స్మగ్లింగ్‌

ABN , Publish Date - Mar 23 , 2026 | 07:02 AM

కన్నడ నటి రన్యారావ్‌ బంగారం స్మగ్లింగ్‌ కేసులో పట్టుబడకముందే ఉగాండా ఏజెంట్‌ చేతిలో రూ.2 కోట్ల మేర...

ఏడాదిలో 127కిలోల బంగారం స్మగ్లింగ్‌

  • కన్నడ నటి రన్యారావు కేసు చార్జిషీట్‌లో ఈడీ వెల్లడి

బెంగళూరు, మార్చి 22(ఆంధ్రజ్యోతి): కన్నడ నటి రన్యారావ్‌ బంగారం స్మగ్లింగ్‌ కేసులో పట్టుబడకముందే ఉగాండా ఏజెంట్‌ చేతిలో రూ.2 కోట్ల మేర మోసపోయినట్లు ఈడీ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. మనీలాండరింగ్‌ కేసులో చార్జ్‌షీట్‌ను ఈడీ బుధవారం బెంగళూరులో దాఖలు చేసింది. గతేడాది మార్చిలో దుబాయ్‌ నుంచి బెంగళూరుకు రూ.12.56 కోట్ల విలువైన 14 కేజీల బంగారాన్ని తీసుకొస్తుండగా రన్యారావ్‌ను విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పలు వివరాలను చార్జ్‌షీట్‌లో వెల్లడించారు. 2024 మార్చి నుంచి 2025 మార్చి వరకు రూ.102.55 కోట్ల విలువైన 127.28 కేజీల బంగారాన్ని దుబాయ్‌ నుంచి రన్యారావ్‌ అక్రమంగా తరలించినట్టు పేర్కొన్నారు. ఆ బంగారాన్ని దేశీయ మార్కెట్‌లో విక్రయించినట్లు తేల్చారు. కాగా, ఇప్పటివరకు రన్యారావ్‌కు చెందిన రూ.34 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప

Updated Date - Mar 23 , 2026 | 07:02 AM