రూ.45 లక్షల కోసం ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది
ABN , Publish Date - May 01 , 2026 | 06:20 AM
డబ్బుపై ఆశతో ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిందో కూతురు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ ఘటన జరిగింది. హతురాలి పేరు నహీదా పర్వీన్. ఆమెకు దత్తత తీసుకున్న...
17 ఏళ్ల బాలిక దుర్మార్గం.. జార్ఖండ్‌లో ఘటన
రాంచీ, ఏప్రిల్ 30: డబ్బుపై ఆశతో ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిందో కూతురు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ ఘటన జరిగింది. హతురాలి పేరు నహీదా పర్వీన్. ఆమెకు దత్తత తీసుకున్న 17 ఏళ్ల కూతురు ఉంది. పర్వీన్ భర్త, విద్యుత్తు విభాగంలో పనిచేసేవారు. ఆయన నాలుగేళ్ల క్రితం చనిపోయారు. సర్వీసులో ఉండగా చనిపోవడంతో విద్యుత్తు విభాగం నుంచి పరిహారంగా పర్వీన్‌కు రూ.45 లక్షలు వచ్చాయి. ఈ డబ్బుకు పర్వీన్ కూతురును నామినీగా పెట్టారు. పర్వీన్ కూతురు బిహార్‌లోని గయాకు చెందిన 20 ఏళ్ల అర్బాజ్ ఖాన్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఆ బాలిక.. అర్బాజ్ అడిగనప్పుడల్లా అతడికి డబ్బులిచ్చేది. ఇది తెలిసి.. ఆమెను తల్లి మందలించింది. పర్వీన్‌ను అడ్డు తొలగించుకుంటే రూ.45లక్షలు తన సొంతం అవుతాయని, మానవీయ కోణంలో ఉద్యోగమూ రావొచ్చునని, అప్పుడు ప్రియుడితో కలిసి విలాసవంతమైన జీవితం గడపొచ్చునని ఆ బాలిక భావించింది. అర్బాన్‌తో కలిసి పర్వీన్ హత్యకు ప్రణాళిక రచించింది. ఇంట్లో పర్వీన్ నిద్రపోతున్నప్పుడు.. ఆ బాలిక, అర్బాజ్, ఆ యువకుడి ముగ్గురు స్నేహితులు కలిసి కాళ్లు, చేతులు కదలకుండా పట్టుకొని, ముఖమ్మీద దిండు పెట్టి.. ఊపిరాడకుండా చేసి చంపారు. హత్య అనంతరం.. ఆ బాలిక, బంధువులకు ఫోన్‌చేసి, తల్లి పర్వీన్ బాత్‌రూంలో జారిపడి ప్రాణాలు కోల్పోయిందని చెప్పింది. బంధువులొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. రెండ్రోజుల తర్వాత.. పర్వీన్ మెడమీద తనకు గాయాలు కనిపించాయని బంధువుల్లో ఒకరు, మిగతా వారికి చెప్పడంతో ఆమె మృతిపై అంతా అనుమానాలు వ్యక్తం చేశారు. పర్వీన్ బావ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పోలీసులు బాలికను అదుపులోకి తీసుకొని విచారించడంతో తానే హత్యచేయించినట్లు ఆమె అంగీకరించింది.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!
పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..