రామ్‌లీలా మైదాన్.. బుకింగ్స్ ఫుల్!
ABN , Publish Date - Oct 14 , 2026 | 04:49 AM
ఏదైనా కార్యక్రమం కోసం ఎవరైనా రామ్‌లీలా మైదాన్‌ను బుక్ చేసుకోవాలనుకుంటే ఈ ఏడాదిలో కేవలం 3 రోజులే అవకాశం ఉందని, డిసెంబరు 29, 30, 31తేదీలకు మాత్రమే ఇంకా బుకింగ్ మిగిలి ఉందని, మిగతా అన్ని రోజులకు బుకింగ్స్ అయిపోయాయని అధికారులు వెల్లడించారు.
డిసెంబరు 29, 30, 31 తేదీల్లో మాత్రమే ఖాళీ
నిరసన ప్రాంతంగా ప్రకటించిన మరుసటి రోజే ప్రకటన
బుకింగ్‌కు 1.21లక్షలు.. ఇందులో రూ.55వేలు డిపాజిట్
న్యూఢిల్లీ, అక్టోబరు 13: ఏదైనా కార్యక్రమం కోసం ఎవరైనా రామ్‌లీలా మైదాన్‌ను బుక్ చేసుకోవాలనుకుంటే ఈ ఏడాదిలో కేవలం 3 రోజులే అవకాశం ఉందని, డిసెంబరు 29, 30, 31తేదీలకు మాత్రమే ఇంకా బుకింగ్ మిగిలి ఉందని, మిగతా అన్ని రోజులకు బుకింగ్స్ అయిపోయాయని అధికారులు వెల్లడించారు. అంటే డిసెంబరు 29వ తేదీ వరకు రామ్ లీలా మైదాన్ ఖాళీగా ఉండదన్న మాట. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా కోసం ఇటు సీజేపీ, అటు విపక్షాలు ఢిల్లీలో భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్న, ఆందోళనలను ఇంకా ఉధృతం చేయాలనుకుంటున్న క్రమంలోనే మైదానం కేవలం మూడు రోజులు, అది కూడా రెండున్నర నెలల తర్వాత ఖాళీగా ఉంటుందన్న ప్రకటన రావడం గమనార్హం. ఇన్నేళ్లుగా ‘నిరసనలు తెలియజేయాల్సిన ప్రాంతం’గా ఉన్న జంతర్ మంతర్ హోదాను ఢిల్లీ పోలీసులు తొలగించి.. రామ్ లీలా మైదాన్, బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్‌లను కొత్త నిరసన ప్రాంతాలుగా ప్రకటించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడింది. రామ్‌లీలా మైదాన్ 12ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ ఏదైనా కార్యక్రమం అయితే 50వేల మంది పాల్గొనవచ్చు. ఒక్క రోజు బుకింగ్ చేసుకోవాలంటే రూ.1.21లక్షలు చెల్లించాలి. ఇందులో రూ.55వేలు సెక్యూరిటీ డిపాజిట్. రామ్‌లీలా మైదాన్‌ను బుకింగ్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ హార్టికల్చర్ విభాగం అనుమతి ఇస్తతంది. దరఖాస్తుకు ఢిల్లీ పోలీసుల నుంచి ఎన్‌వోసీ తప్పనిసరి.
ఈ వార్తలు కూడా చదవండి
సీఈసీ రాజీనామా చేయకుంటే అభిశంసన తప్పదు.. ఎంపీ శశిథరూర్ హెచ్చరిక
నాసా–స్పేస్‌ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ఐ ఎస్ ఎస్ కు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక