Share News

మహిళల ఆకాంక్షలను కాంగ్రెస్‌ చిదిమేసింది

ABN , Publish Date - Apr 20 , 2026 | 07:09 AM

కాంగ్రె్‌సను మహిళలు క్షమించరని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఓడించడం ద్వారా వారి ఆశలు, ఆకాంక్షలను...

మహిళల ఆకాంక్షలను కాంగ్రెస్‌ చిదిమేసింది

8 ఆ పార్టీ క్షమాపణ చెప్పాలి: రామ్మోహన్‌నాయుడు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): కాంగ్రె్‌సను మహిళలు క్షమించరని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఓడించడం ద్వారా వారి ఆశలు, ఆకాంక్షలను ఆ పార్టీ చిదిమేసిందని విమర్శించారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ నివాసంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో కలసి రామ్మోహన్‌ మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌ అంశంపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. దీనివల్ల ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి, ఏ రాజకీయ పార్టీకి అన్యాయం జరుగుతుందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ‘మహిళా సాధికారతకు అడ్డుపడాలని చూస్తున్న విపక్షాల కుట్రలు సాగవు. 2029 నాటికి మహిళా రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది’ అని ఆయన అన్నారు. డీలిమిటేషన్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారనేదానిపై ప్రతిపక్షాలు ప్రతి మహిళకూ సమాధానం చెప్పాలన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ

భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో

Updated Date - Apr 20 , 2026 | 07:09 AM