పారిశుద్ధ్య కార్మికురాలికి సూపర్ స్టార్ రజనీకాంత్ బిగ్ గిఫ్ట్..
ABN , Publish Date - Feb 03 , 2026 | 06:23 PM
వీధిలో లభించిన బంగారు నగలను పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న ఓ పారిశుద్ధ్య కార్మికురాలిని సూపర్ స్టార్ రజనీకాంత్ అభినందించారు. ఆమెకు బంగారు గొలుసు బహుమతిగా ఇచ్చి సత్కరించారు.
ఇంటర్నెట్ డెస్క్: తన నిజాయితీని చాటుకున్న చెన్నై పారిశుద్ధ్య కార్మికురాలు పద్మకు (Sanitation Worker Padma) సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajnikanth) బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారు (Gold Chain Gift). ఇటీవల రోడ్డుపై తనకు లభించిన రూ.45లక్షల విలువైన బంగారు నగల గురించి పైఅధికారులకు పద్మ సమాచారం అందించారు. ఆ తరువాత వాటిని పోలీసులకు అప్పగించి తన నిజాయితీ చాటుకున్నారు.
మంగళవారం సూపర్ స్టార్ రజనీకాంత్‌ను చెన్నైలోని ఆయన నివాసంలో పద్మ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను రజనీకాంత్ అభినందించారు. బంగారు గొలుసును బహూకరించారు. అంతకుమునుపు, రజనీకాంత్ తన వీరాభిమాని రజనీ శేఖర్‌ను కూడా అభినందించారు. రజనీ శేఖర్ మదురైలో ఓ చిన్న ఫుడ్‌స్టాల్‌ను నిర్వహిస్తుంటారు. స్టాల్‌కు రజనీకాంత్ పేరే పెట్టుకున్నారు. తన స్టాల్‌లో పరాఠాలు అందరికీ అందుబాటులో ఉండేలా కేవలం రూ.5లకే విక్రయిస్తూ రజనీకాంత్ దృష్టిని ఆకర్షించారు. దీంతో, రజనీశేఖర్‌కు సూపర్ స్టార్ బంగారు గొలుసును ఇచ్చారు.
ఇక, తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్.కె.స్టాలిన్ కూడా పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను అభినందించారు. ఆమె నిజాయితీకి అభినందనగా రూ.లక్ష చెక్కును అందించారు. పద్మ టీ నగర్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా చేస్తున్నారు.
ఇవీ చదవండి:
బడ్జెట్ సమావేశాలు.. 8మంది ఎంపీల సస్పెన్షన్..
హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. మంత్రికి తప్పిన ప్రమాదం