Share News

7 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.. భర్తను చంపేశారు..

ABN , Publish Date - Feb 09 , 2026 | 07:44 AM

రాజస్థాన్‌లో కలకలం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 225 కిలోమీటర్ల దూరం కారణంగా మానసిక ఒత్తిడికి గురైన అంజలి.. తన భర్తను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది..

7 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.. భర్తను చంపేశారు..
Rajasthan

ఇంటర్‌నెట్ డెస్క్: రాజస్థాన్ హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 225 కిలోమీటర్ల దూరం కారణంగా మానసిక ఒత్తిడికి గురైన అంజలి.. తన భర్తను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం.. 2018లో ఓ పెళ్లి వేడుకలో అంజలి, సంజయ్‌లకు పరిచయం ఏర్పడింది. సంజయ్ ఆ పెళ్లిలో వెయిటర్‌గా పని చేయడానికి వచ్చాడు. ఇద్దరికీ మాటలు కలిశాయి. అక్కడి నుంచి వెళ్లిపోయేటప్పుడు సంజయ్ తన ఫోన్‌ నెంబర్‌ను అంజలికి ఇచ్చాడు.


అయితే, అంజలి దగ్గర ఫోన్ లేకపోవటంతో ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది. ఇలా 7 ఏళ్లు గడిచిపోయాయి. 2024లో అంజలి కొత్త ఫోన్ కొనుక్కుంది. ఫోన్ కొనుక్కున్న వెంటనే సంజయ్‌కి ఫోన్ చేసింది. అలా ఇద్దరి మధ్య మళ్లీ మాటలు మొదలయ్యాయి. కొంతకాలానికే ప్రేమ చిగురించింది. గంటలు, గంటలు ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉండేవారు. అంజలి వేరే వ్యక్తిని ప్రేమిస్తోందని తెలిసినా కూడా ఆమె తల్లిదండ్రులు ఆశిష్ కుమార్‌తో పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత అంజలి భర్తతో కలిసి రావ్లా వెళ్లిపోయింది. అత్తింటికి వెళ్లిన తర్వాత ఆమె మానసికంగా కుంగిపోయింది.


అంజలి పుట్టింటి నుంచి రావ్లాకు 225 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దూరం ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టసాగింది. అత్తింటికి వెళ్లినా కూడా సంజయ్‌తో టచ్‌లో ఉంది. హత్య జరగడానికి 16 రోజుల ముందు ఆమె పుట్టింటికి వచ్చింది. ఈ సమయంలోనే ఇద్దరూ ఆశిష్ హత్యకు ప్లాన్ చేశారు. పెళ్లి తర్వాత ఇద్దరూ నేరుగా కలుసుకోకపోయినా వాట్సాప్ ద్వారానే మర్డర్ ప్లాన్ చేశారు. హత్య గురించి 5 నుంచి 7 సార్లు మాట్లాడుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం జనవరి 30వ తేదీన ఆశిష్‌ను హత్య చేశారు. ఆశిష్ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమై చివరకు అందరూ దొరికిపోయారు.


ఇవి కూడా చదవండి..

ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. భారత్ నిధులందిస్తోందంటూ పాక్ మంత్రి ఆరోపణలు..

బంగారం, వెండి స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 09 , 2026 | 10:46 AM