Share News

మూడు సిటీల పేర్లు మార్పు.. మౌంట్ ఆబూ ఇకనుంచి ఆబూ రాజ్

ABN , Publish Date - Feb 27 , 2026 | 08:45 PM

ముూడు ప్రముఖ నగరాలు, పట్టణాల పేర్లను మారుస్తున్నట్టు రాజస్థాన్ ప్రభుత్వం శుక్రవారంనాడు ప్రకటించింది. ప్రఖ్యాత హిల్‌స్టేషన్‌ మౌంట్ ఆబూ ఇక నుంచి ఆబూ రాజ్‌గా పేరుమార్పు సంతరించుకుంటుంది.

మూడు సిటీల పేర్లు మార్పు.. మౌంట్ ఆబూ ఇకనుంచి ఆబూ రాజ్
Bhajan Lal Sharma

జైపూర్: ముూడు ప్రముఖ నగరాలు, పట్టణాల పేర్లను మారుస్తున్నట్టు రాజస్థాన్ (Rajasthan) ప్రభుత్వం శుక్రవారంనాడు ప్రకటించింది. ప్రఖ్యాత హిల్‌స్టేషన్‌ మౌంట్ ఆబూ (Mount Abu) ఇక నుంచి ఆబూ రాజ్‌గా పేరుమార్పు సంతరించుకుంటుంది. జహాజ్‌పూర్ పేరు యజ్ఞపూర్‌గా, కామా పేరు కామవన్‌గా మారనున్నాయి. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ (Bhajan Lal Sharma) రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారంనాడు ఈమేరకు ప్రకటించారు.


చారిత్రక ప్రాధాన్యత ఏమిటంటే..

రాజస్థాన్‌లోని ఏకైక హిల్‌స్టేషన్‌గా మౌంట్ ఆబూకు పేరుంది. ఆరావళి పర్వత శ్రేణిలోని మౌంట్ ఆబూ ప్రధాన పర్యాటక కేంద్రంగా టూరిస్టులను ఆకర్షిస్తోంది. చల్లటి వాతావరణం, నదులు, సరస్సులు, జలపాతాలు, పచ్చని వాతావరణంతో ఏడాదంతా విజిటర్లను అహ్లాదపరుస్తోంది. అలాగే, భిల్వారా జిల్లాలోని జహాజ్‌పూర్ సంస్కృతి, మత ప్రాధాన్యత కలిగిన చారిత్రక పట్టణం. రాజపుత్రుల కాలం నాటి పురాతన ఆలయాలు, మెట్లబావులు, వారసత్వ కట్టడాలు ఎన్నో ఈ ప్రాంతంలో ఉన్నాయి. కాగా, భరత్ జిల్లాలోని కామా పట్టణం సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. బ్రజ్ ప్రాంతంలో భాగంగా శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని గడిపిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది.


ఇవి కూడా చదవండి..

ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. దిగువ కోర్టు తీర్పుపై హైకోర్టులో సీబీఐ పిటిషన్

అవిముక్తేశ్వరానంద స్వామికి అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ

Updated Date - Feb 27 , 2026 | 08:55 PM