రాజా రవివర్మ పెయింటింగ్ రూ.167 కోట్లు.. చరిత్ర సృష్టించిన ‘యశోద-కృష్ణ’ చిత్రం!
ABN , Publish Date - Apr 02 , 2026 | 09:41 PM
ప్రముఖ కళాకారుడు రాజా రవి వర్మ గీసిన ‘యశోధ-కృష్ణ’ అనే తైలవర్ణ చిత్రం, వేలంలో రూ.167.2 కోట్లక (సుమారు$18 మిలియన్లు) అమ్ముడుపోయి, భారతీయ కళకు ఒక కొత్త ప్రయాణాన్ని నెలకొల్పింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ కళాకారుడు రాజా రవివర్మ గీసిన ‘యశోధ-కృష్ణ’ అనే తైలవర్ణ చిత్రం, వేలంలో రూ.167.2 కోట్లకు (సుమారు$18 మిలియన్లు) అమ్ముడుపోయింది. బుధవారం ముంబైలో జరిగిన సాఫ్రనార్ట్ స్ప్రింగ్ లైవ్ వేలంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడైన బిలియనీర్ సైరస్ పూనావాలా ఈ కళాఖండాన్ని దక్కించుకున్నారు. భారతీయ ఆధునిక కళా రంగంలో ఒక చిత్రపటం ఈ స్థాయిలో ధర పలకడం ఇదే తొలిసారి.
చిత్రం ప్రత్యేకత..
రాజా రవివర్మ చిత్రాల్లో ‘యశోధ-కృష్ణ’ పెయింటింగ్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మాతృత్వాన్ని, బాలకృష్ణుడి లీలలను తన కుంచెతో ఆయన అత్యంత సహజంగా, రమణీయంగా తీర్చిదిద్దారు. వర్ణాల కలయిక, బావ వ్యక్తికరణలో ఈ చిత్రం ఎంతో గొప్పగా నిలిచింది.
ముంబై వేదికగా జరిగిన ఈ వేలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్ట్ కలెక్టర్లు ఆసక్తి చూపించిన్నప్పటికీ, చివరికి సైరస్ పూనావాలా రికార్డు స్థాయి ధరను వెచ్చింది ఈ అద్భుత కళా ఖండాన్ని దక్కించుకున్నారు. ఇంత ధర పలకడం అంతర్జాతీయ వేదికలపై భారతీయ చిత్రకళకు ఉన్న విలువు, ప్రాముఖ్యత మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది.
ఇవి కూడా చదవండి
దుకాణదారుడు చేసిన తప్పు.. కస్టమర్‌కు కోట్లు కురిపించింది..
30 ఏళ్ల వయసులో లవ్.. ఈ తప్పులు అస్సలు చేయకండి