Share News

ఐఆర్ఎస్ అధికారి కుమార్తె మర్డర్ కేసు.. ఎందుకు చంపాడో చెప్పిన నిందితుడు..

ABN , Publish Date - Apr 24 , 2026 | 03:35 PM

ఐఆర్ఎస్ అధికారి కూతురిని చంపాలన్న ఉద్దేశం తనకు లేదని, అనుకోకుండా జరిగిపోయిందని నిందితుడు రాహుల్ పోలీసులకు చెప్పాడు. డబ్బులు, నగలు దొంగతనం చేయడం కోసమే ఆ ఇంటికి వెళ్లినట్లు తెలిపాడు.

ఐఆర్ఎస్ అధికారి కుమార్తె మర్డర్ కేసు.. ఎందుకు చంపాడో చెప్పిన నిందితుడు..
Rahul Meena Delhi news

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తె మర్డర్ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడు రాహుల్ మీనాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ సందర్భంగా రాహుల్ కీలక విషయాలు బయటపెట్టాడని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఐఆర్ఎస్ అధికారి కూతురిని చంపాలన్న ఉద్దేశం తనకు లేదని, అనుకోకుండా జరిగిపోయిందని నిందితుడు రాహుల్ పోలీసులకు చెప్పాడు. డబ్బులు, నగలు దొంగతనం చేయడం కోసమే ఆ ఇంటికి వెళ్లినట్లు తెలిపాడు.


‘అక్క డబ్బులు ఇచ్చి ఉంటే ఇలా జరిగేదే కాదు..’ అని అన్నాడు. హత్య చేసినందుకు రాహుల్ పశ్చాత్తాపపడుతున్నాడు. ‘నువ్వు ఎందుకు ఆమెను కొట్టావు’ అని పోలీసులు ప్రశ్నించగా.. ‘నగలు, డబ్బు దొంగతనం చేయాలన్న ఉద్దేశంతో ఆ ఇంటికి వెళ్లాను. కానీ, ఆ అక్క అరవటం మొదలెట్టింది. ఎంత చెప్పినా వినలేదు. నన్ను దొంగతనం చేయకుండా ఆపడానికి ప్రయత్నించింది. అక్కడ ఉన్న దీపంతో ఆమెను కొట్టాను. ఆమె స్పృహ తప్పిపడిపోయింది. నేను ఆమెను చంపాలనుకోలేదు. అలా జరిగిపోయింది’ అని రాహుల్ చెప్పాడు.


నిందితుడు సీనియర్ ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో 8 నెలల పాటు పని చేశాడు. ఆ ఇంట్లో వాళ్ల గురించి అతడిని అడిగినప్పుడు.. ‘ఆ ఇంట్లో వాళ్లు నా దృష్టిలో దేవుళ్లతో సమానం. వాళ్లిద్దరూ(ఐఆర్ఎస్ అధికారి, ఆయన భార్య) చాలా మంచి వారు. కానీ, నాకు డబ్బులు కావాల్సి ఉండింది’ అని అన్నాడు. కాగా, నిందితుడు రాహుల్ మీనాకు కోర్టు నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.


ఇవి కూడా చదవండి

పురాతన ఆలయాల పునఃనిర్మాణానికి రూ.800 కోట్లు: మంత్రి ఆనం రామనారాయణ

భారత్ నుంచి ప్రపంచానికి షాపింగ్ మరింత సులభం

Updated Date - Apr 24 , 2026 | 04:15 PM