ప్రజాగ్రహాన్ని అణిచివేసేందుకు ఎమర్జెన్సీ
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:30 AM
మరో ఏడాదిలో ప్రధాని పదవి నుంచి మోదీ దిగిపోతారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.. మోదీ తన చెప్పుచేతల్లో పెట్టుకొని నియంత్రించిన ‘‘వ్యవస్థ’’ ఇప్పుడు...
మోదీ ప్రభుత్వం విధించే అవకాశం ఉంది: రాహుల్
న్యూఢిల్లీ, జూన్ 3: మరో ఏడాదిలో ప్రధాని పదవి నుంచి మోదీ దిగిపోతారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.. మోదీ తన చెప్పుచేతల్లో పెట్టుకొని నియంత్రించిన ‘‘వ్యవస్థ’’ ఇప్పుడు షేక్ అవుతోందని, కుప్పకూలుతోందని.. అందుకే తన అంచనా ప్రకారం ఆయన మరో ఏడాదికి మించి ప్రధానిగా కొనసాగరని చెప్పారు. దేశంలో తీవ్ర ఆర్థిక సునామీ రాబోతోందని, ధరలు విపరీతంగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభాన్ని చవిచూడబోతున్నారని పేర్కొన్నారు. ప్రజల నుంచి ఒత్తిళ్లు, ఆగ్రహం కారణంగా వ్యవస్థలు కూడా తిరుగుబాటు చేసే పరిస్థితికి చేరుకున్నాయని హెచ్చరించారు. ఎన్నికల సంఘం, నిఘా సంస్థల అధిపతులు, న్యాయ వ్యవస్థలోని సీనియర్ సభ్యులు అంతర్గతంగా తిరుగుబాటు చేస్తున్నారని.. దీనిపై వారే స్వయంగా తనకు సమాచారాన్ని పంపుతున్నారని రాహుల్ చెప్పారు. మోదీ, అమిత్ షా గురించి సమాచారం అంతా వ్యవస్థల ద్వారే తనకు ఎప్పటికప్పుడు తెలుస్తోందని, ఇది మోదీకి కూడా తెలుసునని చెప్పారు. పెల్లుబుకుతున్న ప్రజాగ్రహాన్ని అణచివేసేందుకు దేశంలో ఎమర్జెన్సీ లాంటిది విధించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన
గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..