Share News

తమిళనాట కాంగ్రెస్‌కు జాక్‌పాట్‌!

ABN , Publish Date - Jun 04 , 2026 | 06:22 AM

మిళనాట కాంగ్రెస్‌కు జాక్‌పాట్‌ తగిలింది. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి సీవీ షణ్ముగం రాజీనామా చేయడంతో...

తమిళనాట కాంగ్రెస్‌కు జాక్‌పాట్‌!

  • రాజ్యసభ సీటు ఇచ్చేందుకు విజయ్‌ సమ్మతి

చెన్నై, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): తమిళనాట కాంగ్రెస్‌కు జాక్‌పాట్‌ తగిలింది. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి సీవీ షణ్ముగం రాజీనామా చేయడంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని కాంగ్రె్‌సకు ఇచ్చేందుకు టీవీకే అధినేత, సీఎం విజయ్‌ అంగీకరించారు. ఈ నెల 18న జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆ స్థానాన్ని తమ మిత్రపక్షమైన కాంగ్రె్‌సకు ఇవ్వనున్నట్లు విజయ్‌ బుధవారం సాయంత్రం ప్రకటించారు. నిజానికి మంగళవారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం, బుధవారం ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ గిరీష్‌ చోడంకర్‌ విజయ్‌తో భేటి అయి దీనిపై చర్చించారు. రాజ్యసభ స్థానాన్ని తమకు ఇవ్వాలన్న వారి వినతిని విజయ్‌ అంగీకరించారు. కాగా, డీఎంకే ఇండియా కూటమిలోనే వుందని కాంగ్రెస్‌ తమిళనాడు వ్యవహారాల ఇన్‌చార్జ్‌ గిరీష్‌ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..

Updated Date - Jun 04 , 2026 | 06:22 AM