Share News

కేంద్ర విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jul 28 , 2026 | 06:46 PM

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రహ్లాద్ జోషి అత్యంత నీచమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి అంటూ రాహుల్ మండిపడ్డారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు..
Rahul Gandhi

న్యూఢిల్లీ, జులై 28: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రహ్లాద్ జోషి అత్యంత నీచమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి అంటూ రాహుల్ మండిపడ్డారు. రేపిస్ట్‌లను ఆయన రక్షిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం పార్లమెంట్ బయట రాహుల్ గాంధీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


రాహుల్ మాట్లాడుతూ.. ‘యువత విద్యావ్యవస్థపై నిరసనలు తెలుపుతోంది. చాలా మంది అమ్మాయిలు ఆందోళనలు చేస్తున్నారు. పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. అంతటితో ఆగకుండా.. రేపిస్ట్‌లను సమర్థించే ఓ వ్యక్తిని బీజేపీ విద్యాశాఖ మంత్రిని చేసింది. ఆయన అత్యంత నీచమైన వ్యక్తి. రేపిస్ట్‌లకు రక్షణ కావాలని చెప్పే వ్యక్తి కంటే మించిన నీచమైన వ్యక్తి మరొకరు ఉండరు. అలాంటి వ్యక్తి భారతదేశ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో దోషుల శిక్షా కాలాన్ని తగ్గించి, విడుదల చేయడాన్ని గతంలో ప్రహ్లాద్ జోషి సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్ ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి

IRCTC కొత్త రూల్స్.. తత్కాల్ టికెట్ బుకింగ్ మరింత సులభం

7వ అంతస్తు నుంచి పడి యూపీ మాజీ మంత్రి మృతి..

Updated Date - Jul 28 , 2026 | 06:55 PM