7వ అంతస్తు నుంచి పడి యూపీ మాజీ మంత్రి మృతి..
ABN , Publish Date - Jul 28 , 2026 | 06:05 PM
ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ నేత, మాజీ మంత్రి నానక్ రామ్ భుర్జీ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. 7వ అంతస్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ నేత, మాజీ మంత్రి నానక్ రామ్ భుర్జీ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. 7వ అంతస్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లఖ్‌నవూలోని దారుల్ సఫా న్యూ ఎమ్మెల్యే రెసిడెన్స్ బిల్డింగ్ 7వ అంతస్తు నుంచి నానక్ రామ్ కిందపడ్డారు. రెసిడెన్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. తీవ్రగాయాలపాలైన ఆయనను సివిల్ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చేరిన కొన్ని నిమిషాలకే నానక్ రామ్ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఈ సంఘటనపై ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. నానక్ రామ్ మరణంపై పోలీసులు అనుమానస్పద మృతి కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దారుల్ సఫా న్యూ ఎమ్మెల్యే రెసిడెన్స్ సిబ్బందిని విచారించారు. గత కొన్నిరోజుల నుంచి నానక్ రామ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నారని వారు చెప్పారు. తరచుగా రెసిడెన్స్ చుట్టూ తిరుగుతూ ఉండేవారని తెలిపారు. పోలీసులు.. నానక్ రామ్ ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? తెలుసుకునే పనిలో పడ్డారు.
ఇవి కూడా చదవండి
భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ రాజీనామా.. ఐపీఎల్‌లో చేరేందుకు సిద్ధం!
చాట్ యాప్‌లలో సైబర్ నేరాల నివారణపై సుప్రీంకోర్టు దృష్టి