Share News

వాళ్లు దోషులైనా లేదా అసమర్థులైనా అయ్యుండాలి: రాహుల్ గాంధీ

ABN , Publish Date - Aug 10 , 2026 | 01:40 PM

పార్లమెంటుకు విద్యార్థుల ర్యాలీ సందర్భంగా పోలీసు బలప్రయోగానికి దిగడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు.

వాళ్లు దోషులైనా లేదా అసమర్థులైనా అయ్యుండాలి: రాహుల్ గాంధీ
Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంటుకు విద్యార్థుల ర్యాలీ సందర్భంగా పోలీసు బలప్రయోగానికి దిగడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ ఉదంతంలో పాలకులు దోషులైనా లేదా అసమర్థులైనా అయ్యుండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

‘పెల్లెట్ గన్నులు, ముళ్లు ఉన్న బాటన్స్, టియర్ గ్యాస్.. వీటితో విద్యార్థులపై దాడులు జరిగాయి. శాంతియుతంగా ప్రశ్నలు అడిగిన వారిపై దాడులు జరిగాయి. యువతులను కూడా పోలీసులు కొట్టారు. పలువురికి ఎముకలు విరిగాయి. ప్రశ్నలు అడిగిన వారితో మోదీ ప్రభుత్వం అనాగరికంగా వ్యవహరించింది’


‘పార్లమెంటు సమావేశాలు 20 రోజులుగా జరుగుతున్నా హోం మంత్రి సభకు రాలేదు. విద్యార్థులపై బలప్రయోగంపై చర్చించేందుకు ప్రతిపక్షం ప్రవేశపెట్టిన ప్రతి తీర్మానం తిరస్కరణకు గురైంది. ఈ మౌనం నిర్లక్ష్యమో మరొకటో కాదు.. అక్కడ జరిగిన హింసకు ఆమోదం. వాళ్లు దోషులైనా అయ్యుండాలి లేదా అసమర్థులైనా అయ్యుండాలి. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఈ ఉదంతంపై దర్యాప్తు జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అప్పటివరకూ మా పోరాటం ఆగదు’ అని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

అయోధ్య రామమందిర ట్రస్టు సీఈఓ పోస్టు.. ఇంటర్వ్యూకు 18 మంది ఎంపిక

పేపర్ లీక్.. ఝార్ఖండ్‌లో కీలక దశకు చేరుకున్న విద్యార్థుల నిరసన

Updated Date - Aug 10 , 2026 | 01:54 PM