Share News

పేపర్ లీక్.. ఝార్ఖండ్‌లో కీలక దశకు చేరుకున్న విద్యార్థుల నిరసన

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:27 AM

ఝార్ఖండ్‌ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పేపర్ లీక్ ఉదంతంపై విద్యార్థుల నిరసనలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో విద్యార్థులు అసెంబ్లీ వరకూ ర్యాలీని ప్రారంభించారు.

పేపర్ లీక్.. ఝార్ఖండ్‌లో కీలక దశకు చేరుకున్న విద్యార్థుల నిరసన
Jharkhand Student march to Assembly

ఇంటర్నెట్ డెస్క్: ఝార్ఖండ్‌ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పేపర్ లీక్ ఉదంతంపై విద్యార్థుల నిరసనలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో విద్యార్థులు అసెంబ్లీ వరకూ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వేలాదిగా స్టూడెంట్స్ రాజధాని రాంచీకి తరలివచ్చారు. ప్రభుత్వం తమ డిమాండ్స్‌పై స్పందించాల్సిందేనంటూ విద్యార్థులు నినదించారు.


విద్యార్థులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంది. పలు కూడళ్లు, రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేసింది. సున్నిత పరిస్థితులున్న ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసింది. భారీగా పోలీసులను మోహరించింది. రాంచీలో నేడు ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. రాజధానికి వచ్చే వారి సంఖ్యను వీలైనంతగా పరిమితం చేసేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలు, రాష్ట్ర రహదారులపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

పేపర్ లీక్స్ ఉదంతంపై ఇప్పటివరకూ పలు మార్లు విద్యార్థులు, ప్రభుత్వం మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై దృష్టి సారించేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యేక ప్యానల్‌ను కూడా ఏర్పాటు చేసింది. అయితే, ప్రభుత్వ చర్యలపై పెదవి విరుస్తున్న విద్యార్థులు గతంలో ప్రకటించినట్టు అసెంబ్లీ వరకూ ర్యాలీ ప్రారంభించారు.


ఈ వార్తలనూ చదవండి:

కారు ప్రమాదానికి గురైన ఏఆర్ రెహమాన్ కుమారుడు..

ఎన్‌సీపీఐలో అభిప్రాయభేదాలు.. బీజేపీకి మద్దతుపై ముగ్గురు సభ్యుల అభ్యంతరం!

Updated Date - Aug 10 , 2026 | 12:04 PM