Share News

అయోధ్య రామమందిర ట్రస్టు సీఈఓ పోస్టు.. ఇంటర్వ్యూకు 18 మంది ఎంపిక

ABN , Publish Date - Aug 10 , 2026 | 01:08 PM

అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు త్వరలో జరగనున్నాయి. ఈ పోస్టు కోసం 5300 పైచిలుకు మంది దరఖాస్తు చేసుకోగా ఇంటర్వ్యూ కోసం 18 మందిని ఎంపిక చేసినట్టు ట్రస్టు వర్గాలు తెలిపాయి.

అయోధ్య రామమందిర ట్రస్టు సీఈఓ పోస్టు.. ఇంటర్వ్యూకు 18 మంది ఎంపిక
Ram mandir Trust CEO Candidates Shortlisted

ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు త్వరలో జరగనున్నాయి. ఈ పోస్టు కోసం 5,300 పైచిలుకు మంది దరఖాస్తు చేసుకోగా ఇంటర్వ్యూ కోసం 18 మందిని ఎంపిక చేసినట్టు ట్రస్టు వర్గాలు తెలిపాయి. మంగళ, బుధవారాల్లో ఆలయ ప్రాంగణంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేదీ, శ్రీ షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు మాజీ చైర్మన్ సురేశ్ హవారేలతో కూడిన ప్యానెల్‌ అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించనుంది.

సీఈఓగా 50 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తిని ఎంపిక చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. హిందూ మతాన్ని ఆచరించే వారు, శాకాహారులైన వారినే సీఈఓగా ఎంపిక చేయనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రామమందిర వ్యవహారాలన్నిటినీ సీఈఓ పర్యవేక్షించాల్సి ఉంటుంది. రామమందిర విరాళాల చోరీ వెలుగులోకి రావడంతో ఇలాంటివి పునరావృతం కాకుండా సీఈఓను నియమించాలని ట్రస్ట్ నిర్ణయించిన విషయం తెలిసిందే.


మరోవైపు, విరాళాలచోరీపై దర్యాప్తు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ రిపోర్టు మేరకు పోలీసులు ఇప్పటికే ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదును రికవరీ చేశారు. శుక్లా నుంచి అత్యధికంగా రూ.20.39 లక్షలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి బంగారం, వెండి నగలతో పాటు విదేశీ కరెన్సీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

కారు ప్రమాదానికి గురైన ఏఆర్ రెహమాన్ కుమారుడు..

ఎన్‌సీపీఐలో అభిప్రాయభేదాలు.. బీజేపీకి మద్దతుపై ముగ్గురు సభ్యుల అభ్యంతరం!

Updated Date - Aug 10 , 2026 | 01:34 PM