ఎఫ్‌ఐఆర్‌లు నాకు మెడల్స్ లాంటివి
ABN , Publish Date - Oct 08 , 2026 | 01:33 AM
తన మీద నమోదయ్యే ప్రతీ ఎఫ్‌ఐఆర్ తనకు లభించే పతకం (మెడల్) వంటిదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు.
ఇప్పటి వరకూ 45 నమోదు చేశారు.. నా లక్ష్యం 100
ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆపను: రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ, అక్టోబరు 7: తన మీద నమోదయ్యే ప్రతీ ఎఫ్‌ఐఆర్ తనకు లభించే పతకం (మెడల్) వంటిదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు. ఇప్పటి వరకూ తనపై 45 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు. తన లక్ష్యం 100 ఎఫ్‌ఐఆర్‌లని.. ఎన్ని కేసులు పెట్టినా రాజ్యాంగ పరిరక్షణ కోసం తన పోరాటాన్ని ఆపబోనని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలోకి వెళ్లి బైఠాయించినందుకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారా అన్న విలేకర్ల ప్రశ్నకు రాహుల్ ఈ సమాధానమిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
శివరాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం.. ముఖానికి అతి సమీపాన పేలిన టపాసులు
ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం..