ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం..
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:27 PM
దేశ రాజధాని ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఐదు అంతస్తుల భవనం ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఇవాళ (బుధవారం) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఐదు అంతస్తుల భవనం ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మరోవైపు, భవనం వద్దకు పెద్దఎత్తున స్థానికులు చేరుకున్నారు. కూలిపోయిన భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక సిబ్బందితో కలిసి తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ రాళ్లు, కాంక్రీట్ శ్లాబ్‌లను తొలగిస్తూ బాధితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీమాపురి గోల్‌చక్కర్, డీఎల్‌ఎఫ్ భోపురా తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అయితే, బాధితులను కాపాడేందుకు అంబులెన్స్‌లు, రెస్క్యూ వాహనాలు ఘటనాస్థలికి వేగంగా చేరుకునేలా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ మేరకు రహదారులను ఖాళీగా ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్లపై ఆగడం, వాహనాలను పార్క్ చేయడం లేదా పెద్దఎత్తున గుమిగూడటం వంటివి చేయవద్దని సూచించారు. కాగా, భవనం కూలడానికి గల కారణాలు, ఎవరైనా మృతిచెందారా, శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారనే విషయాలపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు.
ఈ వార్తలు కూడా చదవండి
25 ఏళ్ల పాలనపై ప్రధాని మోదీ ప్రసంగం.. కీలక అంశాలివే..
నాపై 45 ఎఫ్‌ఐఆర్‌లు.. ఒక్కో కేసు ఒక్కో మెడల్: రాహుల్ గాంధీ