డీలిమిటేషన్‌కు మద్దతు ఇవ్వడమంటే తమిళనాడును మోసగించడమే: రాహుల్ గాంధీ
ABN , Publish Date - Aug 01 , 2026 | 08:44 PM
నియోజకవర్గ పునర్విభజన బిల్లును కేంద్రం మరోసారి పార్లమెంటు ముందుకు తీసుకురానుందన్న వార్తల నడుమ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: నియోజకవర్గ పునర్విభజన బిల్లును కేంద్రం మరోసారి పార్లమెంటు ముందుకు తీసుకురానుందన్న వార్తల నడుమ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్‌ను తమిళనాడు ప్రజాస్వామిక హక్కులను దూరం చేసే కుట్రగా అభివర్ణించారు. తమిళనాడును బలహీనపరిచేలా బిల్లును రూపొందించారని అన్నారు. ఈ బిల్లును వీగిపోయేలా చేయాలని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు పిలుపునిచ్చారు. బిల్లుకు మద్దతు ఇవ్వడమంటే తమిళనాడుకు ద్రోహం చేయడమేనని అన్నారు. తమిళనాడు వ్యక్తులు ఎవరూ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకూడదని అన్నారు. ప్రతి వ్యక్తీ బిల్లును వ్యతిరేకించాలని అన్నారు. ప్రతి తమిళపార్టీ, జాతీయ పార్టీ బిల్లు వీగిపోయేలా చేయాలని కోరారు.
ఇటీవల పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలోని పరిణామాల నేపథ్యంలో పార్లమెంటులో ఎన్డీయే బలం పెరిగిందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి మహిళా రిజర్వేషన్, నియోజకవర్గ పునర్ విభజన బిల్లులను పాస్ చేయించుకునేందుకు ప్రయత్నించవచ్చన్న కామెంట్స్ వినిపించాయి. ఇటీవల కాంగ్రెస్‌తో విభేదాల నేపథ్యంలో డీఎంకే కూడా బిల్లు విషయంలో మెత్తబడే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి.
ఈ విషయమై ఇటీవల డీఎంకే నేత టీకేఎస్ ఈలంగోవన్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్‌తో పునర్ విభజనకు లంకె పెట్టి బిల్లు పాస్ చేయించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ విషయంలో పలు పార్టీలు రకరకాల సూచనలు ఇచ్చాయని, అయితే, డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల సీట్లపై ప్రభావం పడకూడదని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
స్వాతంత్ర్యం అంటే అది కాదు! జెన్ జీ నిరసనల నేపథ్యంలో ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ వ్యాఖ్య
ఇథనాల్ బ్లెండింగ్ లేకపోతే పెట్రోల్ ధర రూ.125కు చేరేది: కేంద్రం