Share News

అప్పుడు చెబితే నమ్మలేదు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు?

ABN , Publish Date - Sep 29 , 2026 | 08:35 PM

గత రెండేళ్లుగా తాను ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్నప్పటికీ పార్టీ నేతల నుంచే పెద్దగా మద్దతు లభించలేదని రాహుల్ గాంధీ వ్యక్తం చేసినట్టు సమాచారం.

అప్పుడు చెబితే నమ్మలేదు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు?
Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: గత రెండేళ్లుగా తాను ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్నప్పటికీ పార్టీ నేతల నుంచే పెద్దగా మద్దతు లభించలేదని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్‌లో చర్చ మరింత వేడెక్కింది. మంగళవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు బయటకు వచ్చాయి (Rahul Gandhi Vote Chori).


గత రెండేళ్లుగా ఓట్ల చోరీ అంశాన్ని తాను ప్రస్తావిస్తున్నానని, కాంగ్రెస్‌లోని కొందరు నేతలు తన మాటలను అంగీకరించలేదని, ఇప్పుడు అందరూ ఈ అంశాన్ని అర్థం చేసుకున్నారని రాహుల్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని రాహుల్ పార్టీ నేతలకు ఈ సందర్భంగా సూచించినట్లు తెలుస్తోంది. ఈవీఎంలకు సంబంధించిన ప్రశ్నలను కూడా బహిరంగంగా బలంగా ప్రస్తావించాలని రాహుల్ సూచించినట్లు సమాచారం (Congress CWC meeting).


ఢిల్లీ బేలా ఎస్టేట్‌లో ఓటర్ల పేర్ల తొలగింపుపై కూడా రాహుల్ గాంధీ ఇటీవల ప్రశ్నలు లేవనెత్తారు. అక్కడ 728 మంది నివసిస్తుండగా.. ఎస్‌ఐఆర్ (SIR) తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితాలో ఒక్కరి పేరు మాత్రమే మిగిలిందని ఆయన ఆరోపించారు. 727 మంది పేర్లు తొలగించారని పేర్కొంటూ.. ఇది ఓటు హక్కుపై ప్రభావం చూపుతోందని అన్నారు. మొత్తంగా ఓట్ల చోరీ అంశాన్ని పార్టీ మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలకు సూచించినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.. 4x400 మీటర్ల రిలేలో అదరగొట్టిన అమ్మాయిలు..


శ్రీ చరణి సంచలనం.. అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించి రికార్డ్..

Updated Date - Sep 29 , 2026 | 08:39 PM