Share News

మోదీ దేశాన్ని నడపలేరు: రాహుల్‌

ABN , Publish Date - May 12 , 2026 | 05:20 AM

పశ్చిమాసియా సంక్షోభంతో నెలకొన్న సవాళ్లను అధిగమించేందుకు దేశ ప్రజలు పొదుపు పాటించాలన్న మోదీ వ్యాఖ్యలను ప్రతిపక్ష కాంగ్రెస్‌ తప్పుబట్టింది...

మోదీ దేశాన్ని నడపలేరు: రాహుల్‌

న్యూఢిల్లీ, మే 11: పశ్చిమాసియా సంక్షోభంతో నెలకొన్న సవాళ్లను అధిగమించేందుకు దేశ ప్రజలు పొదుపు పాటించాలన్న మోదీ వ్యాఖ్యలను ప్రతిపక్ష కాంగ్రెస్‌ తప్పుబట్టింది. మోదీ ఇంకెంతమాత్రమూ దేశాన్ని నడపలేరని పేర్కొంది. మోదీ వ్యాఖ్యలు ఆయన వైఫల్యానికి నిదర్శనమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ‘‘ప్రజలు త్యాగాలు చేయాలని, బంగారం కొనవద్దని, విదేశాలకు వెళ్లవద్దని, తక్కువ పెట్రోలు వినియోగించాలని, ఎరువుల వాడకం, వంటనూనెలు తగ్గించాలని, మోదీ సూచిస్తున్నారు. కానీ, అవి సూచనలు కాదు.. వైఫల్యాలకు నిదర్శనం’’ అని ‘ఎక్స్‌’లో రాహుల్‌ పోస్ట్‌ చేశారు. 12 ఏళ్ల పాలనలో ప్రజలు ఏం కొనాలో, ఏం తినాలో చెప్పే పరిస్థితికి దేశాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. తన వైఫల్యాలకు ప్రజల పైకి నెట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి..

మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..

సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్

Updated Date - May 12 , 2026 | 05:20 AM